Maa Inti Bangaram : సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. తేజ సజ్జా కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మరో కీలక పాత్రలో నటించారు. చాలాకాలం క్రితమే రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో డీసెంట్ హిట్ అనిపించింది. ఈ సినిమాలో, వయసు పైబడిన వృద్ధురాలు మళ్లీ 24 ఏళ్ల వయసుకి వస్తే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి అనే ఆసక్తికరమైన కథనంతో మంచి హిట్ టాక్ సంపాదించింది. ఇక ఇప్పుడు సమంత మరోసారి హీరోయిన్‌గా నందినీ రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే సినిమా రూపొందుతోంది.
READ ALSO: Delhi Blast Case : ఢిల్లీ పేలుడు కేసు NIAకి అప్పగింత !
తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాలో కూడా అలాంటి ఒక సోషియో ఫాంటసీ ఎలిమెంట్ ఉండబోతుందని అంటున్నారు. అయితే, ఈసారి దాన్ని కాస్త భిన్నంగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. సమంత నిర్మాణ సంస్థ ట్రాలలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నిడుమూరు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద, మరోసారి సమంత తనకి కలిసి వచ్చిన జానర్‌లోనే సినిమా చేయబోతూ ఉండడం గమనార్హం.
READ ALSO: Hafiz Saeed: ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఎక్కడ దాక్కున్నాడు?
