టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు… నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది..తర్వాత మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి కొన్ని రోజులు సినిమాలకి గుడ్ బై చెప్పి ట్రీట్మెంట్ తీసుకొని ఆ వ్యాధి నుండి బయటపడింది. ఇక ఎప్పుడైతే ఆ వ్యాధి బారిన పడిందో అప్పటినుండి సమంత తన హెల్త్ విషయం లో చాలా జాగ్రత్తగా ఉంటుంది.. ప్రతిదీ వైద్యుల సలహా మేరకు వాడుతుందని చెబుతున్నారు..
సామ్ తినే తిండి నుండి వేసుకునే చెప్పుల వరకు ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తలు పాటిస్తోంది. ఇక గత కొన్ని రోజుల ముందు సమంత ఎయిర్పోర్ట్లో నుండి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆమె వేసుకున్న చెప్పుల గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది.. వాటి ఖరీదు విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఆమె చెప్పుల ఖరీదు అక్షరాల రెండు లక్షల 58 వేల 97 రూపాయలు కావడంతో సమంత అంత కాస్ట్లీ చెప్పులు ధరించడం ఏంటి అంటూ చాలామంది నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు… దీనిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి..
అంత ఖరీదైన చెప్పులు వేసుకోవడం పై పెద్ద రీజన్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.. అదేంటంటే సమంత ఈ మధ్య కాలంలోనే మయాసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ వ్యాధి బారిన పడిన వారి అరికాళ్లు చాలా స్మూత్ గా తయారవుతాయట. అందుకే అలా స్మూత్ గా ఉన్న అరి కాళ్ళకు ర్యాష్ గా ఉండే చెప్పులను వేసుకుంటే ఆమె కాళ్ళు పాడైపోయే అవకాశం ఉన్నందువల్ల డాక్టర్లు ఆమెను మెత్తటి చెప్పులు వేసుకోమని సలహా ఇచ్చారట.. అందుకే సామ్ అలాంటి చెప్పులను వాడుతుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.. ఏది ఏమైనా టాప్ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తుంది..