బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘సామ్ బహదూర్’ చిత్రం గత ఏడాది డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.భారత ఆర్మీ తొలి ఫీల్డ్ మార్షల్ సామ్ మనెక్‍షా జీవితం ఆధారంగా యుద్ధం బ్యాక్‍డ్రాప్‍లో ఈ బయోగ్రఫికల్ మూవీ తెరకెక్కింది.సామ్ బహదూర్ చిత్రానికి మేఘనా గుల్జర్ దర్శకత్వం వహించారు.విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ మూవీ మోస్తరు వసూళ్లను రాబట్టింది.
థియేటర్స్ లో ఆకట్టుకున్న సామ్ బహదూర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారిక ప్రకటన చేసింది. జనవరి 26వ తేదీ న రిపబ్లిక్ డే సందర్బంగా ‘సామ్ బహదూర్’ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు వెల్లడించింది.
భారత అతిగొప్ప సైనికుడు అంటూ పోస్టర్ ను రిలీజ్ చేసింది.”ఓ దార్శనికత కలిగిన నాయకుడు, దిగ్గజం, నిజమైన హీరో మీ స్క్రీన్‍లను కమాండ్ చేయడానికి వస్తున్నారు! జనవరి 26వ తేదీన జీ5లో సామ్ బహదూర్ ప్రీమియర్ అవుతుంది” అని జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు (జనవరి 22) ట్వీట్ చేసింది. సామ్ బహదూర్ మూవీలో సామ్ మనెక్‍షా పాత్ర చేసిన విక్కీ కౌశల్‍కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. మేకోవర్ నుంచి నటన వరకు ఆయన ఎంతో అద్భుతంగా చేశారు. ఈ చిత్రంలో ఫాతిమా సనా షేక్, సాన్య మల్హోత్రా, నీరజ్ కబీ, రాజీవ్ కర్చూ, మహమ్మద్ జీషన్ అయూబ్ మరియు ఎడ్వర్డ్ సోనెన్‍బ్లిక్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మేఘన గుల్జర్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.సామ్ మనెక్‍షా జీవితం, ఆయన సాధించిన ఘనతల ఆధారంగా సామ్ బహదూర్ చిత్రం తెరకెక్కింది. 1962 భారత్, చైనా యుద్ధం మరియు 1971 భారత్, పాకిస్థాన్ మధ్య దాడులు కూడా ఈ మూవీలో ప్రధానంగా ఉన్నాయి. ఆర్మీ తొలి ఫీల్డ్ మార్షల్‍గా సామ్ మనెక్‍షా ఉన్న సమయంలో భారత ఆర్మీ సాధించిన గొప్ప విజయాలను ఈ సినిమాలో మేకర్స్ చూపించడం జరిగింది.
A visionary leader, legend, and a true hero – Sam is all set to command your screens!#SamBahadur premieres 26th Jan on #ZEE5#SamBahadurOnZEE5 pic.twitter.com/PC0WU1tSKT
— ZEE5Official (@ZEE5India) January 22, 2024