కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానం చేశారు. ఈరోజు చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో ఖుర్షీద్‌కు సీఎం అవార్డును అందించారు. అవార్డు అందుకున్న అనంతరం సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. ఈ అవార్డు తనకు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. ఈ అవార్డు తనకు ఎంతో ప్రత్యేకం అని, తన జీవితంలో దీనికి మించిన అవార్డు మరొక్కటి లేదని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ దేశాన్ని ఒక్కటిగా చేయడానికి ఈ యాత్ర చేశారని, ఇప్పుడు రాహుల్ గాంధీ సైతం ఇదే బాటలో నడుస్తున్నారని ఖుర్షీద్ చెప్పుకొచ్చారు.
Also Read: Revanth Reddy: గాంధీని హత్య చేసిన మతతత్వవాదులు బ్రిటీషర్ల కంటే ప్రమాదం!
‘రాహుల్ గాంధీ ఆలోచనలు, ఆశయాలు ఆ భగవంతుడు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఈ రోజు దేశంలో మనం చూడకూడనివి ఎన్నో చూస్తున్నాము. ఒక హిందూ రైతు పంట పండిస్తాడు. అలాగే ఒక ముస్లిం రైతు కూడా పంట పండిస్తాడు. కానీ పంట పండించిన తర్వాత ఆది ఎవరి వరకు చేరుతుందో ఎవరికీ తెలియదు. హిందూ పండించిన పంట ముస్లిం తినొచ్చు.. ముస్లిం పండించిన పంట హిందూ తినొచ్చు. ఆది రక్తంగా మారుతుంది.ఒకరిది o +, b+, b- ఇలా ఏదైనా గ్రూప్ బ్లడ్ ఉండొచ్చు.కానీ H -హిందూ.. M- ముస్లిం బ్లడ్ అని తెలియదు కదా. కానీ ఈ రోజు సమాజంలో మనం ఎలాంటి సంఘటలు చూస్తున్నాము, వింటున్నాము. ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు’ అని సల్మాన్ ఖుర్షీద్ చెప్పుకొచ్చారు.
