ఒకరు సినిమా రంగంలో టాప్ హీరో, మరొకరు క్రికెట్ లో లెజెండ్. వీళ్ళిద్దరూ కలిస్తేనే రచ్చ అనుకుంటే, ఇప్పుడు ఏకంగా పొలం గట్లపై బురదలో దిగి సందడి చేస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే.. సల్మాన్ ఖాన్‌కు ముంబై బయట పన్వేల్‌లో ఒక పెద్ద ఫామ్‌హౌస్ ఉన్న విషయం తెలిసిందే. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు ఆయన రైతులా మారిపోతుంటారు. ఇప్పుడు సల్మాన్ భాయ్‌తో కలిసి మన ‘కెప్టెన్ కూల్’ ధోని కూడా బురద ఆటలో దిగారు. ట్రాక్టర్ తో పొలం దున్నుతూ, ఒళ్లంతా బురద చేసుకుని ఈ ఇద్దరు స్టార్స్ చేస్తున్న హంగామా మామూలుగా లేదు. వీరితో పాటు సింగర్ ఏపీ థిల్లాన్ కూడా తోడై అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read : Nandu : దేశం వదిలిపోదాం అనుకున్నాం.. 12 రోజులు నరకం చూశా..
నిజానికి ఎంత పెద్ద స్టార్లయినా, ప్రకృతికి దగ్గరగా గడపడంలో ఉండే ఆ కిక్కే వేరు. ఒంటికి బురద అంటుకున్న పట్టించుకోకుండా, ఒక సామాన్య రైతులా కష్టపడటంలో ఉన్న ఆనందాన్ని వీరు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ధోని ఇప్పటికే సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే, దాంతో భవిష్యత్తులో సల్మాన్ ఖాన్‌తో కలిసి ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఏదేమైనా, కోట్లు సంపాదించే ఈ స్టార్స్ ఇలా మట్టిలో కలిసి ఆడుకోవడం చూస్తుంటే నెటిజన్లు “అసలైన లైఫ్ అంటే ఇదే కదా!” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజంట్ ఈ ఫోటోలు వైరల్ అవుతున్నారు.
