NTV Telugu Site icon

Salman Khan: సల్మాన్ ఖాన్ కు డెంగ్యూ.. జయం రవికి కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్

Salmankhan

Salmankhan

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అనారోగ్యానికి గురయ్యారు. గత కొన్ని రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నాడు. రక్త పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సల్మాన్ కు డెంగీగా నిర్ధారించారు. దీంతో ఆయనను వారంపాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. అలా చివరకు సల్మాన్ ఖాన్ బెడ్ రెస్ట్ తీసుకుంటుండటంతో.. షూటింగ్‌లు వాయిదా పడ్డట్టు తెలుస్తోంది.

Read Also: Gold Rate Today : పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర

అయితే ఇప్పుడు కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అనే సినిమా షూటింగ్ ఆపేశారట. బిగ్ బాస్ పదహారో సీజన్‌ షోకు సల్మాన్ ఖాన్ రాలేడు కాబట్టి.. కరణ్ జోహర్‌తో షూట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇటీవట టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోరిక మేరకు.. గాడ్‌ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం సల్మాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా ఝాన్‌’ సినిమాని తెరకెక్కుస్తున్నాడు. విశేషం ఏంటంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్దే కూడా ఇటీవల కాలుకి గాయం అవ్వడంతో ఇంటికే పరిమితమైంది. ఈ సినిమాలో పూజాకి అన్నయ్య పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపించబోతున్నాడట. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలో మెరబోతున్నాడు.

Read Also: Simona Halep: డోప్ టెస్టులో దొరికిన టెన్నిస్ స్టార్.. నిషేధం విధింపు

సల్మాన్ సంగతి ఇలా ఉంటే.. జయం రవి కరోనా బారినపడ్డట్టు తెలుస్తోంది. ఈ మేరకు జయం రవి వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘నిన్న సాయంత్రమే టెస్ట్ చేసుకుంటే కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రస్తుతం నేను క్వారంటైన్‌కు పరిమితమయ్యాను.. ఈ రెండుమూడు రోజులు నన్ను కలిసిన ప్రతీ ఒక్కరూ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ మాస్క్ వేసుకోండి.. జాగ్రత్తగా ఉండండి’ అంటూ జయం రవి ట్వీట్ వేశాడు.