Baba Ramdev: సల్మాన్‌ఖాన్‌ డ్రగ్స్ తీసుకుంటాడు.. బాబా రాందేవ్‌ సంచలన వ్యాఖ్యలు

Baba Ramdev

Baba Ramdev

Baba Ramdev: ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీ, సినీతారలపై వివాదాస్పద ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌లో మాదకద్రవ్యాల వాడకం విరివిగా ఉందని ఆయన అన్నారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులో బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ ఆయన ఈ ఆరోపణలు చేశారు. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని, అమీర్ ఖాన్ గురించి నాకు తెలియదు. షారుఖ్ ఖాన్ బిడ్డ డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుబడి జైలులోనే ఉన్నాడు. నటీమణుల విషయానికొస్తే, వారి గురించి దేవుడికి మాత్రమే తెలుసన్నారు.

ఇప్పుడు బాలీవుడ్‌ అంతా డ్రగ్స్ గుప్పిట్లో చిక్కుకుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే సినీ రంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్న డ్రగ్స్‌.. రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టినట్లు రాందేవ్‌ పేర్కొన్నారు. దేశంలో ఎన్నికలు జరిగే సమయంలో మద్యం ఏరులై పారుతోందని అన్నారు. డ్రగ్స్‌ బానిసత్వం నుంచి భారతదేశాన్ని విముక్తి చేసేందుకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని బాబా రాందేవ్‌ అన్నారు. అలాగే డ్రగ్స్‌ విముక్త్‌ భారత్‌ కోసం ఉద్యమం చేయనున్నట్లు బాబా రాందేవ్‌ తెలిపారు. బాబా రాందేవ్‌ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇలా అనేక సార్లు బాబా రాందేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.