Prudhvi Raj Sukumaran: ఇటీవల మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్( Prudhvi Raj Sukumaran) ఓ సినిమా షూటింగులో గాయపడ్డ విషయం తెలిసిందే. ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో అర్థాంతరంగా చిత్ర బృందం షూటింగ్ నిలిపివేసింది. ‘విలయత్ బుద్ధ’ అనే మూవీ షూటింగ్ లో గాయపడ్డ పృథ్వీ రాజ్ సుకుమారన్ తన హెల్త్ అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా తనక ప్రమాదం జరిగిన మాట వాస్తవమేనని ధృవీకరించారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, కొన్ని నెలలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్లు వెల్లడించారు.
KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ ‘సలార్’లో ఒక ముఖ్యమైన పవర్-ప్యాక్డ్ పాత్రను పోషిస్తున్నాడు పృథ్వీ రాజ్ సుకుమారన్. పృథ్వీరాజ్ తన రాబోయే చిత్రం విలయత్ బుద్ధ షూటింగ్‌లో గాయపడినట్లు కొన్ని రోజుల కింద వార్తలు బయటకు వచ్చాయి. మోకాలికి కీహోల్ సర్జరీ చేయించుకున్నారని, మూడు నెలల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని నివేదికలు వచ్చాయి. అతను కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. వీటన్నింటి మధ్యలో, పృథ్వీరాజ్ సుకుమారన్ తన గాయంపై అప్‌డేట్‌తో ముందుకు వచ్చాడు. తాను సోషల్ మీడియాలో… ‘‘నేను విలయత్ బుద్ధ సినిమా యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాను. అదృష్ణవశాత్తూ నిపుణులైన డాక్టర్ల సమక్షంలో నాకు కీలకమైన శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం నేను రెండు నెలలు విశ్రాంతి తీసుకుంటాను. అలాగే ఫిజియోథెరపీ కూడా జరుగుతోంది. నేను నొప్పితో పోరాడుతున్నాను. సాధ్యమైనంత త్వరగా తిరిగి వస్తాను. నా ఆరోగ్యం పట్ల ఆందోళన చెందడమే కాకుండా.. నాపై ప్రేమను వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అంటూ తన పృథ్వీ రాజ్ నోట్ విడుదల చేశారు.