Site icon NTV Telugu

Salaar Teaser: ‘సలార్‌’ టీజర్‌ను కేజీఎఫ్-2తో పోల్చుతున్న ఫాన్స్.. బాలేదంటూ..!

Prabhas Hand

Prabhas Hand

Fans Compares Prabhas Salaar Teaser vs KGF Chapter2 Teaser: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘సలార్‌’ టీజర్‌ వచ్చేసింది. ఈరోజు ఉదయం 5.12 నిమిషాలకు టీజర్ రిలీజ్ అయింది. ఇప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించిన మాస్ అవతారాలకు మించి.. ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. సలార్ మూవీతో మరోసారి భారతీయ సినీ ఇండస్ట్రీని షేక్ చేసేందుకు సిద్ధమయినట్లుగా టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే సలార్‌ టీజర్‌పై ప్రభాస్ ఫాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఒక నిమిషం 46 నిమిషాల నిడివి గల సలార్‌ టీజర్‌.. టీనూ ఆనంద్‌ డైలాగ్‌తో మొదలైంది. ‘సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా ప్రమాదం కానీ.. జురాసిక్‌ పార్క్‌లో కాదు. ఎందుకుంటే ఆ పార్కులో..’ అనే డైలాగ్‌ అందరినీ ఆకట్టుకుంది. ప్రభాస్‌ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని టీజర్ చూస్తే.. అర్ధమవుతుంది. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న ఫాన్స్ మాత్రం కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో ముఖాన్ని కూడా సరిగా చూపించలేదని ఫాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో సలార్‌ టీజర్‌ను కేజీఎఫ్-2 టీజర్‌తో పోల్చుతున్నారు. కేజీఎఫ్-2 టీజర్‌లో యశ్ కనిపించాడని, చాలా ఎలివేషన్స్ ఉన్నాయని.. సలార్‌ టీజర్‌లో అవి లేవని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ట్వీట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న సలార్‌ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ‘సలార్‌: పార్ట్‌1: సీజ్‌ఫైర్‌’ సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి మాస్ యాక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తున్నారు. మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version