Salaar Teaser: ‘సలార్’ టీజర్‌ను కేజీఎఫ్-2తో పోల్చుతున్న ఫాన్స్.. బాలేదంటూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fans Compares Prabhas Salaar Teaser vs KGF Chapter2 Teaser: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘సలార్’ టీజర్ వచ్చేసింది. ఈరోజు ఉదయం 5.12 నిమిషాలకు టీజర్ రిలీజ్ అయింది. ఇప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించిన మాస్ అవతారాలకు మించి.. ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. సలార్ మూవీతో మరోసారి భారతీయ సినీ ఇండస్ట్రీని షేక్ చేసేందుకు సిద్ధమయినట్లుగా టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే సలార్ టీజర్‌పై ప్రభాస్ ఫాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఒక నిమిషం 46 నిమిషాల నిడివి గల సలార్ టీజర్.. టీనూ ఆనంద్ డైలాగ్‌తో మొదలైంది. ‘సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా ప్రమాదం కానీ.. జురాసిక్ పార్క్‌లో కాదు. ఎందుకుంటే ఆ పార్కులో..’ అనే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. ప్రభాస్ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని టీజర్ చూస్తే.. అర్ధమవుతుంది. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న ఫాన్స్ మాత్రం కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో ముఖాన్ని కూడా సరిగా చూపించలేదని ఫాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
అదే సమయంలో సలార్ టీజర్‌ను కేజీఎఫ్-2 టీజర్‌తో పోల్చుతున్నారు. కేజీఎఫ్-2 టీజర్లో యశ్ కనిపించాడని, చాలా ఎలివేషన్స్ ఉన్నాయని.. సలార్ టీజర్లో అవి లేవని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ట్వీట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న సలార్ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ‘సలార్: పార్ట్1: సీజ్ఫైర్’ సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి మాస్ యాక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తున్నారు. మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Salaar Teaser is out 😈🔥
For me it's look like a Glimpse, it's NOT Disappointed and at the same time it's NOT Satisfied for me🙌❤️But 1 THING which made EXTREME SATISFIED because YES it is KGF UNIVERSE💯🥵#Salaar #KGF pic.twitter.com/4FgeJ8mofW
— Jahirrr (@JH_Editz) July 6, 2023
As a fan GA chpthuna…
KGF2 teaser >>>SALAAR teaser #KGF2 range lo unthadi anukuna kani full disappointed 😴 #SalaarTeaser #prabhas #PrashanthNeel #SalaarTheSaga pic.twitter.com/6emmEPyBVV— Charlie (@NeeAbhimani) July 6, 2023
To be Honest
KGF 2 Teaser >>>> Salaar Teaser
#SalaarTeaser Disappointed pic.twitter.com/yLpHALalkV— Joker 🚩 (@CriticCinema01) July 6, 2023
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!