పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్` సినిమా డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తం గా గ్రాండ్ గా రిలీజ్ అయి బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ పొందుతుంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ని పూర్తి మాస్, యాక్షన్ అవతార్ లో చూడటం తో అభిమానులు ఎంతో సంతోషపడుతున్నారు.డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.. ఫ్యాన్స్ తోపాటు సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా ని ఎంజాయ్ చేస్తున్నారు. సలార్ భారీ కలెక్షన్ల దిశ గా దూసుకుపోతుంది.నాలుగు రోజుల వీకెండ్ ఈ మూవీకి బాగా కలిసొచ్చే అంశం గా చెప్పొచ్చు..ఇదిలా ఉంటే తాజాగా సలార్`కి సంబంధించిన మేకింగ్ వీడియో ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.సినిమా షూటింగ్ సమయంలో టీమ్ పడిన కష్టాన్ని ఇందులో చూపించారు. ప్రభాస్‌ని దేవగా ఆవిష్కరించేందుకు, ఆయన చేసే యాక్షన్ మరియు ఎలివేషన్లని తీసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్, ఆయన బృందం ఎంతగా కష్టపడ్డారో ఇందులో చూపించారు.
అలాగే ఖాన్సార్ సామ్రాజ్యం, వరధ పాత్ర మరియు ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్లని ప్రధానంగా చూపించారు.మరోవైపు ఖాన్సార్ కోట, అందులో చాలా మంది తో షూటింగ్, కాటేరమ్మ యాక్షన్ ఎపిసోడ్ మరియు బీజీఎం కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఎంత కష్టపడారో ఇందులో చూపించారు. మొత్తంగా `సలార్ విధ్వంసం వెనుక జరిగిన కథని ఈ మేకింగ్ వీడియో రూపంలో చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. మూడు రోజుల్లో సలార్ మూవీ నాలుగు వందల కోట్లకు పైగా వసూళు చేసినట్టు గా చిత్ర యూనిట్ వెల్లడించింది.స్నేహం ప్రధానంగా సలార్ సీజ్ ఫైర్ 1 సినిమా తెరకెక్కింది. ఫ్రెండ్స్ గా ఉండే వరద,దేవాలు ఎందుకు శత్రువులు అయ్యారనేది రెండో పార్ట్ లో చూపించబోతున్నారు. దాన్ని సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం పేరు తో తెరకెక్కించనున్నారు.