Salaar: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అని పాడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. బాహుబలి తరువాత ప్రభాస్ దాదాపు మూడు సినిమాలు చేసాడు. పాన్ ఇండియా సినిమాలే అయినా కూడా ప్రేక్షకులను అవి మెప్పించలేకపోయాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ తమ ఆశలన్నీ సలార్ మీదనే పెట్టుకున్నారు. కెజిఎఫ్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆరడుగుల కటౌట్ ను ఎలా వాడుకోవాలో.. ప్రశాంత్ నీల్ కు బాగా అర్ధమయ్యింది. అందుకే ప్రేక్షకులను సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఫిదా చేశాడు. అప్పటి నుంచి ఈరోజు సినిమా రిలీజ్ అయ్యేవరకు హైప్ ను అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చాడు. ఎన్నిసార్లు వాయిదా పడినా.. ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోయినా కూడా సలార్ మీద ఉన్న అంచనాలు కొద్దిగా కూడా తగ్గలేదు. ఇక సలార్ టీజర్ రిలీజ్ అయిన రోజును ఎవరు మర్చిపోలేరు. ఆ టీజర్ లో ప్రభాస్ ను డైనోసర్ తో పోలుస్తూ ఒక ముసలి తాత ఒక కథ చెప్తూ కనిపిస్తాడు.
గ్యాంగ్‌స్టర్స్ అంతా కలిసి వాడెక్కడ అంటూ అరుస్తూ ముసలి తాతను అడిగితే ఆయన ఒక డైలాగ్ చెప్తాడు.. “ఏయ్.. సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూజన్.. లయన్, చీతా , టైగర్, ఎలిఫెంట్ చాలా డేంజరస్.. కానీ జురాసిక్ పార్క్ లో కాదు.. ఎందుకంటే అక్కడ డైనోసర్ ఉంటుంది” అని ఇంగ్లిష్ లో చెప్తాడు. ఆ ఒక్క డైలాగ్.. సలార్ చరిత్రనే మార్చేసింది. ప్రభాస్ ను డైనోసర్ గా పోల్చి చెప్పడంతో.. సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ కు డైనోసర్ అని పేరు కూడా పెట్టేసింది. ఇక థియేటర్ లో ఆ సీన్ కోసం ఫ్యాన్స్ వెయ్యికళ్లతో ఎదురుచూసారు. కానీ, ఆ సీన్ కానీ, డైలాగ్ కానీ రాలేదు. దీంతో అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. అయితే దాన్ని ఎత్తేశారా.. ? అంటే లేదు అనే మాటలు వినిపిస్తుంది. సెకండ్ పార్ట్ లో ఈ డైలాగ్ ఉండే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. సలార్ సీజ్ ఫైర్ లో జరిగిన యుద్ధం గురించి సెకండ్ పార్ట్ లో చెప్పే సన్నివేశాన్ని .. టీజర్ లో రిలీజ్ చేసి ఉండొచ్చని చెప్తున్నారు. ఏదిఏమైనా థియేటర్ లో ఆ డైలాగ్ ఉంటే.. నెక్స్ట్ లెవెల్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు అని అంటున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.