పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “సలార్” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.అప్పటివరకు వరుస ఫ్లాప్స్ అందుకున్న ప్రభాస్ సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాను కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు .ఈ మూవీ దాదాపు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.థియేటర్స్ లో అదరగొట్టిన ఈ మూవీ ఓటిటిలో కూడా దుమ్మురేపింది.ఇదిలా ఉంటే ఈ మధ్యే సలార్ సినిమా స్టార్ మా ఛానెల్లో టెలికాస్ట్ అయింది.అయితే ఒకప్పుడు టీవీలో పెద్ద సినిమా వచ్చిందంటే ఆ సినిమాకు మంచి టీఆర్పీ నమోదయ్యేది.ప్రస్తుతం ఓటిటిల ప్రభావంతో ఈ టీఆర్పీలు తగ్గిపోతున్నాయి.తాజాగా రిలీజ్ అయినా సలార్ మూవీ టీఆర్పీ కూడా దారుణంగా ఉంది.
థియేటర్ లో సూపర్ హిట్ అయిన సలార్ సినిమాకు కేవలం 6.5 టీఆర్పీ మాత్రమే వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన గుంటూరు కారం మరియు నా సామిరంగ లాంటి సినిమాలు కూడా దీనికంటే ఎక్కువ టీఆర్పీ సొంతం చేసుకున్నాయి.నాగార్జున నటించిన నా సామిరంగ సినిమాకు 8 టీఆర్పీ నమోదైంది. కానీ బ్లాక్ బస్టర్ మూవీ సలార్ కు అంతకంటే తక్కువ రావడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. అయితే సలార్ మూవీకి ఇంత తక్కువ టీఆర్పీ రావడం ఐపీఎల్ కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం సాయంత్రం కాగానే ఐపీఎల్ మ్యాచ్ లను చూడటానికి టీవీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో టీవీల్లో ఎంత పెద్ద సినిమా రిలీజ్ అయిన పెద్దగా టీఆర్పీలు నమోదు కావడం లేదు.