Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Sakshi Instagram Post On Ms Dhonis Vintage Knock

Sakshi Dhoni: హాయ్ మహీ.. మ్యాచ్‌ ఓడిపోయామని గ్రహించలేదు!

Published Date :April 1, 2024 , 12:16 pm
By Sampath Kumar
Sakshi Dhoni: హాయ్ మహీ.. మ్యాచ్‌ ఓడిపోయామని గ్రహించలేదు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sakshi Instagram post to Rishabh Pant: ఆదివారం విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ధనాధన్‌ షాట్లతో అలరించాడు. వింటేజ్‌ తలాను గుర్తుచేస్తూ.. విశాఖ స్టేడియాన్ని హోరెత్తించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ.. 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ 2024లో ధోనీ తొలిసారి బ్యాటింగ్‌ చేయడం, భారీ షాట్లు ఆడడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఎంఎస్ ధోనీ ధనాధన్‌ బ్యాటింగ్ చూసి అతడి సతీమణి సాక్షి మైదానంలో కేరింతలు కొట్టారు. ఇక ‘ఎలక్ట్రిక్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డును మహీ అందుకున్నపుడు విశాఖ స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఆ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టే గెలిచిందేమో అన్న అనుమానం కలిగింది. ధోనీ బ్యాటింగ్ చూసి అందరూ చెన్నై మ్యాచ్ ఓడిందనే విషయాన్ని మర్చిపోయారు. ఇదే భావన తనకు కలిగిందని సాక్షి సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Also Read: Sri Lanka Record: శ్రీలంక టీమ్ అరుదైన ఘనత.. 48 ఏళ్ల భారత్‌ రికార్డు బ్రేక్‌!

‘హాయ్ మహీ.. ఉన్నావా?. నీ బ్యాటింగ్ చూసి.. గేమ్‌లో ఓడిపోయామని గ్రహించలేదు’ అని సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ఈ పోస్టుకు ఎంఎస్ ధోనీ అవార్డు స్వీకరిస్తున్న ఫొటోను జత చేసిన సాక్షి.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌ రిషబ్ పంత్‌ను ట్యాగ్‌ చేశారు. ఈ పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 20 పరుగులతో ఢిల్లీపై ఓడింది. ముందుగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి ఓడిపోయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • dc vs csk
  • IPL 2024
  • ms dhoni
  • Sakshi
  • Sakshi Dhoni

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions