NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: భువనేశ్వరి టీడీపీ అధ్యక్షురాలు కానున్నారా..? లోకేష్‌ను ఎందుకు దూరం పెడుతున్నారు?

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: నారా భువనేశ్వరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కానున్నారా..? లోకేష్‌ను ఎందుకు దూరం పెడుతున్నారు..? అంటూ కొత్త అనుమానాలు వ్యక్తం చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. తాడేపల్లిలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు జ్యూడిషియల్ కస్టడీ కి 50 రోజులు అయితే టీడీపీ నేతలు ఉత్సవాలు చేసుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు.. ఎడుపులు, నవ్వులతో ఎన్నికల డ్రామాలు చేస్తున్నారు అని దుయ్యబట్టారు.. వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అరెస్టు అయితే అవి తప్పుడు కేసులు అని ఆధారాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాం.. కేసుల్లో నిజా నిజాలు బయటకు తీసుకువచ్చాం.. వైఎస్‌ జగన్ పై తప్పుడు కేసులు పెట్టామని కాంగ్రెస్ ఒప్పుకుందన్నారు.

Read Also: AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ సమావేశం వాయిదా.. ఎందుకంటే..?

చంద్రబాబు జైల్లో ఉంటే టీడీపీ నేతల చర్యలు పరాకాష్టగా ఉన్నాయని సెటైర్లు వేశారు సజ్జల.. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో చేసిన ప్రదర్శన అంతా ముందే రిహార్సల్స్ చేసి వచ్చినట్లుగా ఉందన్న ఆయన.. ప్రజలు గురించి ఏమనుకుంటున్నారు? అని నిలదీశారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉంటే.. అక్కడ ఎందుకు పోటీ చేయటం లేదు? అని ప్రశ్నించారు. ఇక, జనసేన ఒక పార్టీనా? జనసేన.. టీడీపీకి తోక పార్టీ అని మండిపడ్డారు.. జనసేన అంటూ ఒక షో చేస్తున్నారన్నారు. రాజమండ్రిలో రెండు దేశాల మధ్య చర్చల్లా కూర్చున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అంతర్గతంగా దివాళా తీసింది.. అందుకే రైల్వే క్షతగాత్రుల పరామర్శకు భువనేశ్వరి వెళ్తున్నారని విమర్శించారు. ఆమె టీడీపీ అధ్యక్షురాలు కానున్నారా? లోకేష్ ఏమయ్యాడు? ఎందుకు దూరం పెడుతున్నారు? అంటూ అనుమానం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.