NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుతో చర్చకు రెడీ.. సీఎం అవసరంలేదు.. మా నేతలు చాలు..!

Sajjala

Sajjala

Sajjala Ramakrishna Reddy: రాప్తాడు సభలో సీఎం వైఎస్‌ జగన్ చేసిన విమర్శలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్ విసిరిన ఛాలెంజ్‌కు స్పందించారు.. వైసీపీ అరాచక, విధ్వంసక పాలనపై జగన్‌తో తాను చర్చకు సిద్ధమన్నారు. బూటకపు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు మాని దమ్ముంటే బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా అంటూ సవాల్‌ చేశారు.. అంతేకాదు.. ఏ అంశం మీద అయినా, ఏ రోజైనా, ఎక్కడైనా తాను చర్చకు రెడీ.. చర్చకు వచ్చే దమ్ము జగన్‌కి ఉందా అంటూ ఛాలెంజ్‌ విసిరారు.. అయితే, చంద్రబాబు సవాల్‌పై స్పందించిన సజ్జల రామకృష్ణారెడడ్ఇ.. చర్చకు రెడీ అన్నారు.. ప్రజాస్వామ్యంలో చాలా వేదికలు ఉన్నాయి.. సడెన్ గా ఒక ఛాలెంజ్ తో చంద్రబాబు వచ్చారు.. చంద్రబాబుకు సత్తా ఉంటే 2014-2019 మధ్యలో ఏమి చేశాడో చెప్పాలి. చెత్త పాలన అని దత్తపుత్రుడు చంద్రబాబును వదిలేసి 2019లో ఒంటరిగా పోటీ చేశాడు.. చంద్రబాబువి కారు కూతలు.. బరితెగించి మాట్లాడతారు అంటూ ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.

Read Also: Vishwak Sen: నటుడు అర్జున్ తో విభేదాలపై ఓపెనైన విశ్వక్.. బాక్గ్రౌండ్ ఉన్న హీరోనయితే అలా చేసేవారా?

వైసీపీ మేనిఫెస్టోలో అమలు చేసినవి మేం చెప్పుకుంటున్నాం అన్నారు సజ్జల.. మద్యం అమ్మకాలు రాష్ట్రంలో రతగ్గించగలిగాం.. అయితే మద్య నిషేధాన్ని అనుకున్న పద్ధతిలో చేయలేకపోయాం అన్నారు. మిగతావి అన్ని చేశాం.. ఏది చేయలేదో చెప్పండి? అని నిలదీశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తున్నామని పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో చర్చకు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అవసరం లేదు.. మా నేతలు చాలు అన్నారు. పొద్దుపోని ఛాలెంజ్ లు ఎందుకు చంద్రబాబు ? అంటూ సెటైర్లు వేసిన ఆయన.. అవును కౌంట్ డౌన్ మొదలు అయ్యింది.. ప్రజలు నిర్ణయిస్తారు కదా..? అని ప్రశ్నించారు. మేం వాలంటరీల వ్యవస్థ తెచ్చామని చెబుతున్నాం.. అధికారంలోకి రాని చంద్రబాబు, లోకేష్ ఏదైనా మాట్లాడతారు అని మండిపడ్డారు.

Read Also: Tummala Nageswara Rao: పత్తి కొనుగోళ్ళను కొనసాగించాలి.. కాటన్ కార్పొరేషన్ను కోరిన మంత్రి

చంద్రబాబు, లోకేష్ లకు నియంతల లక్షణాలు ఉన్నాయి అని విమర్శించారు సజ్జల.. చంద్రబాబుకు ఉన్న లక్షణాలు సీఎం వైఎస్‌ జగన్ కు ఆపాదించే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆయన.. లోకేష్ పిల్లోడు కాబట్టి.. ఏది గుర్తు ఉండదు అని దుయ్యబట్టారు. కుప్పంలో దొంగ ఓట్లు బయటపడ్డాయి.. కానీ, టీడీపీ దొంగ ఓట్లు అంటూ డ్రామాలు ఆడుతున్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్‌, చంద్రబాబు విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. పవన్ కల్యాణ్‌ మీద కేసులు పెట్టకూడదని ఏమైనా ఉందా ? అని ఎదురుప్రశ్నించారు. ఏదైనా ఫిర్యాదు వచ్చి ఉంటుంది.. కేసు పెట్టి ఉంటారని తెలిపారు. ఇక, మేనిఫెస్టోపై త్వరలో క్లారిటీ వస్తుంది.. మధ్య నిషేధం, సీపీఎస్‌ ఎందుకు చేయలేదో చెబుతాం.. చేసే హామీలను మాత్రమే సీఎం వైఎస్‌ జగన్‌ ఇస్తారని వెల్లడించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.