Sajjala Ramakrishna Reddy: ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలకు కసరత్తు జరుగుతోంది.. ఆర్ 5 జోన్‌లో ఇళ్ళ నిర్మాణాల పనుల పురోగతిని మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు.. కృష్ణాయపాలెం లే అవుట్ పరిశీలించిన తర్వాత.. వెంకటాయ పాలెంలో సీఎం వైఎస్ జగన్ సభ ఏర్పాట్లపై కూడా ఆరా తీశారు.. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఏర్పాటు అన్నీ శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ జీవం లేదు.. చంద్రబాబు ఇక్కడ రాజధాని అనే ఒక భ్రమను సృష్టించారు.. టీడీపీ, వాళ్ల శక్తులు సృష్టించిన అడ్డంకులు అన్నీ అధిగమించుకుని వచ్చాం.. సంపన్న వర్గాలు మాత్రమే ఉండాలనే ఒక కల వారిది.. కానీ, 50 వేల కుటుంబాలకు ఇక్కడ నివాసం ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ఆరు నెలల్లో ఇళ్ళ పూర్తి చేయాలనే సంకల్పం.. ఇప్పుడు నిజమైన అర్ధంలో జీవం తొణికిసలాడుతోందన్నారు.. ఇక్కడ ఉన్న రైతులు, కూలీలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వలస వెళ్ళి పోయారు.. ఇప్పుడు ఉన్నది రైతుల ముసుగులో ఉన్న టీడీపీ నేతలు మాత్రమేనంటూ మండిపడ్డారు.
కేంద్రానికి, ఏజెన్సీలకు లేఖలు రాస్తున్నారు.. ఇక్కడ పేదలు ఉండటానికి వీలు లేదని. కేంద్రం కనుక ఇళ్ళ నిర్మాణాలకు నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది.. ఇది మా చిత్తశుద్ధి అని స్పష్టం చేశారు సజ్జల.. ఎవరు ఏమనుకున్నా ఆరు నెలల్లో ఇళ్ళ నిర్మాణాలు పూర్తి అవుతాయి.. అన్ని సౌకర్యాలతో ఏ ప్రభుత్వం ఇంత వరకు పేదలకు ఇలాంటి లే అవుట్లు వేయలేదు.. ఐదేళ్లలో ఇక్కడ ఉన్న వారందరూ కోటీశ్వరులు అవటం ఖాయం అని జోస్యం చెప్పారు.. ప్రజాధనం దుర్వినియోగం చేయటం లేదు.. పేదలకు ఇళ్ళు ఇవ్వటాన్ని ఎవరైనా ఎలా తప్పు పడతారా? మా ప్రశ్న ఒక్కటే.. ఇళ్ళ స్థలాలను ఎందుకు ఇస్తారు? మొక్కలు పెంచటానికా? చంద్రబాబు చెప్పినట్లు సమాధుల కోసమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది.. చట్టంలోనే 5 శాతం పేదలకు ఇవ్వాలని ఉందన్నారు. సింగపూర్ సంస్థకు 3 వేల ఎకరాలను చంద్రబాబు ఇచ్చాడు.. అది బాగుందా? అని నిలదీశారు సజ్జల.
ఇది ప్రభుత్వ భూమి.. ప్రైవేటు సంస్థలకు ఇవ్వటం లేదు కదా? చంద్రబాబుకు కొన్ని ప్రాంతాల పట్ల ద్వేషం ఎందుకు.. కొన్ని వర్గాల పట్ల ద్వేషం ఎందుకు అంటూ చంద్రబాబును ప్రశ్నించారు మంత్రి మేరుగ నాగార్జున.. ముఖ్యమంత్రి పేద, బలహీన వర్గాల అభివృద్ధి కోసం తాపత్రయం పడుతున్న నేత.. ఎవరైనా దళితుల్లో పుట్టాలి అనుకుంటారా? అన్న వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. ఇప్పుడు పేదలకు ఇళ్ళు ఇవ్వటాన్ని వ్యతిరేకించటం నీతి మాలిన వ్యవహారమని మండిపడ్డారు. ఈ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించుకోవాలి అని చంద్రబాబు ఆలోచన చేశాడు.. అందుకే సీఎం జగన్ అన్ని వర్గాల పేదలకు ఇక్కడ ఇళ్ళు కట్టి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. అంబేద్కర్, జ్యోతి రావు ఫూలే ఆలోచనలను ఆచరణలో చేసి చూపిస్తున్న వ్యక్తి జగన్.. ఈ ప్రాంతంలో దళితుల ఊర్లు వస్తున్నాయి అంటూ ఆనందం వ్యక్తం చేశారు మంత్రి నాగార్జు.
మరోవైపు.. పేదలకు, పెత్తందార్లకు మధ్య పోరాటం జరుగుతోందని వ్యాఖ్యానించారు మంత్రి జోగి రమేష్.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని చెప్పిన వ్యక్తి చంద్రబాబు.. తమ సామాజిక వర్గం ఒక్కటే ఉండాలని కోర్టులకు వెళ్ళాడు అంటూ ఆరోపణలు గుప్పించారు. 50 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నివాసం ఉండే ఒక చారిత్రక ఘట్టానికి ఎల్లుండి బీజం పడనుంది.. ఎక్కడైనా పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ప్రతిపక్షాలు పోరాటం చేస్తాయి.. ఇక్కడ ప్రభుత్వమే పేదల పక్షాన నిలబడి ఇళ్ళు ఇచ్చేందుకు పోరాటం చేస్తోందని.. ఒక దౌర్భాగ్య ప్రతిపక్షం రాష్ట్రంలో ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్.
