NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: రాజకీయ కక్షతో దాడులు.. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు..

Sajjala

Sajjala

Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత జరుగుతున్న గొడవలకు ఎన్నికల సంఘం వైఫల్యమే కారణమన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు అధికారులను ఎన్నికల ముందే బదిలీ చేశారన్నారు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు… గొడవలను అరికట్టలేకపోతే… బాధ్యత వారిది కాదా అని ప్రశ్నించారు సజ్జల. ఏపీలో ఏకపక్షంగా దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ గొడవలకు ఎలక్షన్‌ కమిషనే బాధ్యత వహించాలన్నారాయన. గొడవలను అరికట్టే ప్రయత్నం కూడా చేయడంలేదని ఆరోపించారు. పరిస్థితి ఇలానే కొనసాగితే బాధ్యత ఎవరిది అంటూ ప్రశ్నించారు సజ్జల. రాజకీయ కక్షతో టీడీపీ హింసా ఖాండ ప్రదర్శిస్తుందన్న ఆయన.. ఈసీ ఉదాసీనంగా వ్యవహరించింది.. ఘర్షణకు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు.. ఎన్నికల సంఘం ముసుగులో ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహణ జరిగింది.. ఎన్నికల సంఘం అధికార, ప్రతిపక్షాలను సమానంగా చూడాలి.. కానీ అలా జరగలేదన్నారు.

టిడిపి, బిజెపి పిర్యాదు ఇవ్వడం.. ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చెయ్యడం పథకం ప్రకారం జరిగిందని విమర్శించారు సజ్జల.. పోలీసు అబ్జర్వర్ పేరుతో వచ్చిన దీపక్ మిశ్రా అధికారులను బెదిరించాడు.. ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ అంతా టిడిపి ఆఫీస్ నుండి జరిగాయి.. వాటికి కావాల్సిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ మైనారిటీ రెడ్డి సామాజిక వర్గాల అధికారులను మార్చేశారు.. మా వాళ్ళని హౌస్ అరెస్టు చేశారు.. టీడీపీ వాళ్ళను బయట తిరగనిచ్చారు.. షెడ్యుల్ విడుదల అయినప్పటి నుండి ఈసీ ఏకపక్షంగానే వ్యవహరించింది.. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇక్కడ ఈసీ తీరు ఉందని మండిపడ్డారు.

పథకాలకు కాకుండా కాంట్రాక్టులకు డబ్బులు వేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు సజ్జల.. ప్రభుత్వంలో రొటీన్ గా జరగాల్సినవి జరుగుతూనే
ఉంటాయి.. ఎన్నికలు అయిపోయాక కూడా చంద్రబాబు అపార్థాలు మానలేదు.. మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రజలు సీఎం జగన్ కు ఆశీస్సులు ఇచ్చారు.. 15 రోజుల్లో అల్ల కల్లోలం సృష్టించాలని టిడిపి చూస్తుంది.. అలాంటి వాటిని ఈసీ అడ్డుకోవాలి.. కౌంటింగ్ అయ్యే వరకూ నిష్పక్షపాతంగా ఉండాలి. తప్పు చేసేది దాడులు చేసేది వాళ్ళు.. మళ్ళీ గవర్నర్ కి ఫిర్యాదు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Show comments