Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: రెచ్చ గొట్టి, దాడికి ఉసిగొల్పింది బాబే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

Sajjala

Sajjala

Sajjala Ramakrishna Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది.. దాడులు, ప్రతిదాడులు, పోలీసుల లాఠీచార్జ్‌, బాష్పవాయువు ప్రయోగం.. విధ్వంసం ఇలా టెన్షన్‌ వాతావరణాన్ని నెలక్పొంది. అయితే, పుంగనూరు ఘటన విషయంలో చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబువి వికృతమైన ఆలోచనలు, అధికారం కోసం దిగజారుతాడు.. రాజకీయ పార్టీగా శాంతి భద్రతలను కాపాడకుండా రెచ్చ గొట్టింది చంద్రబాబే అన్నారు. పుంగనూరు దాడి వెనుక ముందుగానే కుట్ర ఉన్నట్టు సాక్ష్యాలున్నాయి.. దానికి జీపుల్లో రాళ్లు, తుపాకులు ఉండటమే నిదర్శనం అన్నారు.

Read Also: Chandrababu: పుంగనూరులో చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు..

పుంగనూరులో రెచ్చ గొట్టి, దాడికి ఉసిగొల్పింది చంద్రబాబు అని ఆరోపించిన సజ్జల.. చంద్రబాబు సానుభూతి నాటకం పుంగనూరులో బయటపడిందన్నారు. ఆయనే రెచ్చ గొట్టి దాడులకు ఉసి గొల్పి సానుభూతి పొందే నాటకం చేస్తారని. కానీ, చంద్రబాబు నాటకం రక్తి కట్టకపోగా.. ఆయన అసలు స్వరూపం బయటపడిందన్నారు. అయితే, పుంగనూరు ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్తాం అని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో 23 సీట్లతో తెలుగుదేశం పార్టీని కొన ఊపిరితో వదిలిన ప్రజలకు.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని భూ స్థాపితం చేయాలని విజ్ఞప్తి చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.

కాగా, పుంగనూరు పర్యటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తన పర్యటనలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు, టీడీపీ-వైసీపీ వర్గాల ఘర్షణలు, ఆ తర్వాత జరిగిన విధ్వంసంపై సీరియస్‌గా స్పందించిన చంద్రబాబు.. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందోచూశారుగా.. పిల్లి కూడా రూమ్‌లో పెట్టి కొడితే పులి అవుతుందన్నారు. మీరు కర్రలతో వస్తే.. మేం కర్రలతో వస్తాం.. మీరు యుద్ధం చేస్తే.. నేనూ యుద్ధం చేస్తానని వార్నింగ్‌ ఇచ్చారు. నన్ను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుంది.. పుంగనూరులో అదే జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ రోజు జరిగిన విధ్వంసాన్నికి కారణం మంత్రి పెద్దిరెడ్డియే అన్నారు చంద్రబాబు.. ఈ రోజు ఘటనపై విచారణ జరపాలి, బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇది పెద్దిరెడ్డి తాత జాగీరా..? పెద్దిరెడ్డి పెద్ద పుండింగా..? ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో చూశారుగా..? ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు నరకాన్ని చూసారు.. పిల్లి కూడా రూమ్ లో పెడితే కొడితే పులి అవుతుంది… పుంగనూరులో అదే జరిగిందన్నారు.. దెబ్బలు తగిలిలా.. తలలు పగిలినా.. భయపడకుండా ఉన్నారు. పెద్దిరెడ్డికి చల్లా బాబుకు సరైనా మొగుడు దోరికాడు అన్నారు. మంచివాడు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో చూపించారని చంద్రబాబు కామెంట్‌ చేసిన విషయం విదితమే.

Exit mobile version