NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: వారంరోజులుగా చంద్రబాబు డ్రామాలు ప్రజలు గమనించాలి

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు వైసీపీ నేతలు. తాజాగా వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక రేంజ్ లో చంద్రబాబుని ఆడేసుకున్నారు. కందుకూరులో జరిగిన మారణకాండకు చంద్రబాబు బాధ్యత వహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమాయకుల ప్రాణాలు బలికావడానికి చంద్రబాబే కారణమన్నారు. కందుకూరులో నిబంధనలు పాటించి ఉంటే అమాయకులు బలయ్యేవారు కాదన్నారు. చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని, ఆయనకు కనీస సంస్కారం లేదన్నారు. వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. పోలీసు యాక్ట్‌కు లోబడే ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. ఈ నిర్ణయం అన్ని పార్టీలకు వర్తిస్తుంది. జీవోను ఉల్లంఘిస్తామని టీడీపీ ఛాలెంజ్‌ చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించడం సబబు కాదని సూచించారు. కుప్పానికి చంద్రబాబు దండయాత్రలా బయల్దేరారు. సభలు పెట్టుకోవద్దని చంద్రబాబుకు ఎవరూ చెప్పలేదన్నారు.

Read Also: Human Composting : మనుషుల మృతదేహాల నుంచి ఎరువులు.. వినడానికే కొత్తగా ఉంది కదూ

చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. ప్రజలు చంద్రబాబు తీరును గమనించాలి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చంద్రబాబు ఆలోచించాలి. ప్రజల ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత. ప్రజల ప్రాణాలకు కష్టం కలిగించేలా రోడ్లపై సభలు రద్దు చేస్తూ ఓ జీవోను విడుదల చేశాం. ప్రత్యామ్నయ స్థలాలు చూసుకోవాలి. అపార్థాలకు అవకాశం లేకుండా సుదీర్ఘంగా చర్చించి పోలీసు యాక్ట్‌కు లోబడి జీవోను తీసుకువచ్చాం. దీని తరువాత అసలు ఈ ప్రభుత్వం జీవో తీసుకురావడం ఏంటి, దానికి మేం కట్టుబడటం ఏంటి?అమాయకుల ప్రాణాలు బలి కావడానికి నైతికంగా తాను బాధ్యత వహిస్తున్నానని చెప్పాల్సిన పెద్ద మనిషి. కనీసం సంస్కారం ఉంటుందని ఎవరైనా భావిస్తారు. కానీ చంద్రబాబు తనకు కనీస సంస్కారం లేదని, తానొక ఉన్మాదినంటూ, రక్షస సంస్కృతి అంటూ, వ్యవస్థలను కిళ్ల కింద వేసి నలుపుతానంటూ తన పాలనలో అదే చేశారు.

చంద్రబాబు చైతన్య రథాన్ని ఎక్కడికో ఎత్తుకెళ్లారని తప్పుడు ప్రచారం చేస్తోంది. పోలీసులకు ఇంతకంటే వేరే పని లేదా?చంద్రబాబు ఒక క్రైసిస్‌ క్రియేట్‌ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి ఆయనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కందుకూరులో మీరు పోలీసులు చెప్పిన చోట మీటింగ్‌ పెట్టుకుంటే ఈ మారణ కాండ జరిగేదా? అమాయక ప్రాణాలు 8 పోయేవా అన్నారు సజ్జల. రోడ్డు మీద సభల కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. రిస్క్‌ లేకుండా చేయడం ప్రభుత్వ బాధ్యత. దానికి చర్యలు తీసుకోవాలా వద్దా? ఏమాత్రం వివేకం ఉన్న వారు ఇది మంచి ఆలోచన, నిర్ణయం అంటున్నారు. ఈ కట్టుబాటుకు వైయస్‌ఆర్‌సీపీ కూడా లోబడి ఉంటుంది. చంద్రబాబు ఉల్లంఘించడం సరికాదని మేం చెబుతున్నాం. ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని డీఎస్పీ ఎంతో మర్యాదగా మాట్లాడారన్నారు.

Read Also: Karan Johar: నన్ను హత్య చేసిన పర్లేదు.. ఆ హీరోలకు అంత సీన్ లేదు.. కరణ్ సంచలన వ్యాఖ్యలు