సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ప్రేక్షకులను మెప్పించడానికి విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు.మొన్నటి వరకు మల్టీ స్టారర్ మూవీస్ చేసి హిట్స్ అందుకున్న ఈ సీనియర్ హీరో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన సోలో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.ఈ సినిమా జనవరి 13న రానున్నట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఇప్పటికే సంక్రాంతి సీజన్ కు ఆల్రెడీ అరడజను సినిమాలు లైన్ లో ఉండగానే తాజాగా వెంకటేష్ కూడా ఈ లిస్ట్ లోకి జాయిన్ అయ్యాడు. వెంకటేష్ సైంధవ్ సినిమా ద్వారా జనవరి 13న బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.. అయితే ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 22న విడుదల చేయాలి అనుకున్నా కూడా అదే రోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా వస్తుండటంతో సైంధవ్ సినిమా రిలీజ్ డేట్ మార్చుకోక తప్పలేదు. హిట్ సిరీస్ ఫేమ్ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వెంకటేష్‌కు 75వ చిత్రం కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. దానికి తోడు భారీ బడ్జెట్‌తో సైంధవ్ సినిమా తెరకెక్కింది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా నుంచి తాజాగా సాలిడ్ అప్‌డేట్ వచ్చింది.సైంధవ్ సినిమా టీజర్‌ను అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ టీజర్‌కు సంబంధించి మేకర్స్ మరో అప్‌డేట్ ను కూడా ఇచ్చారు. ఈ సినిమా టీజర్ ను రేపు ఉదయం 11:34 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. సైంధవ్‌లో వెంకీకి జోడిగా జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. ఇందులో రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, జయప్రకాశ్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ మూవీ ద్వారా నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.