టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్.ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో 75వ చిత్రంగా తెరకెక్కింది. సైంధవ్ మూవీకి ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మరియు ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాకు భారీగా బజ్ క్రియేట్ అయింది.ఈ సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్ మరియు నా సామిరంగ సినిమాలకు పోటీగా వెంకటేష్ సైంధవ్ మూవీ సంక్రాంతి బరిలోకి దిగింది . సైంధవ్ మూవీకి నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. సైంధవ్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అన్ని రకాల ఎమోషన్లతోపాటు యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. మరికొంతమంది సినిమా కాస్తా స్లో నేరేషన్‌తో ఉందని.. సినిమాలో కొన్ని బ్లాక్స్ మరింత ఇంట్రెస్టింగ్గా తెరకెక్కిస్తే బాగుండేదని చెబుతున్నారు.ఇలా భిన్నాభిప్రాయాలతో సైంధవ్ మూవీకి మిక్స్డ్ టాక్ వస్తోంది..
అయితే సైంధవ్ ఓటీటీ డీల్ మాత్రం ఆసక్తికరంగా మారింది. సైంధవ్ చిత్రం ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది, ఎప్పుడు రిలీజ్ కానుందని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. అయితే సైంధవ్ మూవీ ఓటీటీ పార్టనర్ వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. సైంధవ్ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. సైంధవ్ ఓటీటీ హక్కులకు భారీ పోటీ ఏర్పడగా ఆఖరుకు భారీ ధర వెచ్చించి అమెజాన్ ప్రైమ్ చేజిక్కుంచుకున్నట్లు తెలుస్తుంది.సైంధవ్ కోసం పోటీలో ఉన్న దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ను వెనక్కి నెట్టి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని నిర్మాతలు వెల్లడించినట్లు సమాచారం.ఇక సైంధవ్ మూవీని థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది.. సైంధవ్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి రెండో వారంలో మహాశివరాత్రి సందర్భంగా లేదా మార్చిలో ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.