SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SAIL Recruitment: ప్రభుత్వ రంగ సంస్థలో అప్రెంటిస్‌షిప్ చేయాలనుకునే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) పరిధిలోని రూర్కెలా స్టీల్ ప్లాంట్ 2026-27 సంవత్సరానికి 1,110 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో ప్రత్యేకత ఏమిటంటే.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే మెరిట్, వాక్-ఇన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 26, 2026 లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక ఇందులోని ఖాళీల వివరాలు చూస్తే.. మొత్తం 1,110 పోస్టులు భర్తీ చేయనున్నారు. వాటిలో ట్రేడ్ అప్రెంటిస్ – 421 పోస్టులు, డిప్లొమా అప్రెంటిస్ – 414 పోస్టులు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 275 పోస్టులు ఉన్నాయి. ఇక అర్హతల విషయానికి వస్తే.. ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంకా డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు ఇంజినీరింగ్, జీఎన్ఎం, డి.ఫార్మా, రేడియాలజీ వంటి సంబంధిత విభాగాల్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ నర్సింగ్ వంటి డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 2022 నుంచి 2026 మధ్యకాలంలో రెగ్యులర్ విద్యార్థులుగా తమ విద్యార్హతను పూర్తి చేసి ఉండాలి.
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
వయోపరిమితి కనీస వయస్సు 18 సంవత్సరాలు కాగా.. గరిష్ట వయస్సు 28 సంవత్సరాలుగా నిర్ణయించారు. వయస్సును ఆగస్టు 31, 2026 నాటికి లెక్కిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల స్టైపెండ్ కూడా ఇస్తారు. ట్రేడ్ అప్రెంటిస్ కు రూ.9,600 నుంచి రూ.10,560 వరకు.. డిప్లొమా అప్రెంటిస్ కు రూ.10,900.. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు రూ.12,300 స్టైపెండ్ అందజేస్తారు.
ఈ ఉద్యోగాల కోసం ఐటీఐ అభ్యర్థులు ముందుగా Apprenticeship India Portalలో నమోదు చేసుకోవాలి. డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులు NATS Portalలో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తరువాత “STEEL AUTHORITY OF INDIA LIMITED, ROURKELA STEEL PLANT”ను ఎంపిక చేసి ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 26, 2026. దరఖాస్తుల పరిశీలన అనంతరం మెరిట్ జాబితా ఆధారంగా షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను సెప్టెంబర్ 2026లో వాక్-ఇన్ ప్రక్రియకు పిలవనున్నారు. ఈ అవకాశం ద్వారా ప్రభుత్వ రంగంలోని ప్రముఖ ఉక్కు సంస్థలో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేస్తే మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!