ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఆటగాడు సాయి సుదర్శన్ మెరిశాడు. మొదటి రోజు బ్యాటింగ్‌లో (87) అదరగొట్టిన సాయి.. రెండో రోజు ఫీల్డింగ్‌లో ఔరా అనిపించాడు. స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన 7వ ఓవర్లోని రెండో బంతిని విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ షాట్ ఆడగా.. ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సాయి ఊహించని రీతిలో క్యాచ్ అందుకున్నాడు. బంతి వేగంగా దూసుకురాగా.. ముందుగా సాయి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.
అయితే బంతి సాయి సుదర్శన్ కుడి చేతికి తాకి ఆపై బాడీకి తాకింది. అనంతరం బంతి సాయి ఎడమ చేతిలో ఆగింది. దెబ్బ గట్టిగానే తాకినా.. అతడు బంతిని మాత్రం వదలలేదు. షాక్‌తో విండీస్ బ్యాటర్ జాన్ క్యాంప్‌బెల్ మైదానం వీడాడు. దాంతో 21 పరుగుల వద్ద విండీస్ తొలి వికెట్‌ను కోల్పోయింది. విండీస్ క్యాచ్ పట్టిన తర్వాత సాయి నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే భారత జట్టు ఫిజియో వచ్చి చికిత్స చేశాడు. సాయి క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన ఫాన్స్ ‘సూపర్ క్యాచ్’, ‘సాయి సూపర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
SAI SUDHARSAN WITH A SPECTACULAR CATCH. 🤯pic.twitter.com/OsWITs9vIH
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2025