NTV Telugu Site icon

Ranji Trophy: డబుల్ సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్..

Sai Sudharshan

Sai Sudharshan

రంజీ ట్రోఫీ-2024 ఎలైట్‌ గ్రూప్‌-డి పోటీల్లో తమిళనాడు బ్యాటర్ సాయి సుదర్శన్ చెలరేగాడు. ఈ రోజు తమిళనాడు-ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. గ్రూప్ డి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తమిళనాడు ఒక వికెట్ నష్టానికి 379 పరుగులు చేసింది. తమిళనాడు బ్యాటర్లలో సాయి సుదర్శన్ అజేయ డబుల్ సెంచరీ సాధించాడు. సుదర్శన్ 202* పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఎన్ జగదీశన్ (101 బంతుల్లో 65 పరుగులు)తో కలిసి మొదటి వికెట్‌కు 168 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని .. వాషింగ్టన్ సుందర్ (96 నాటౌట్)తో కలిసి రెండో వికెట్‌కు 211 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఢిల్లీ బౌలర్లను సాయి సుదర్శన్ ఒక ఆట ఆడుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో నవదీప్ సైనీ ఒక్కడే ఒక వికెట్ తీయగలిగాడు. మిగతా బౌలర్లు ఎవరూ వికెట్ సాధించడంలో ఫలితం రాబట్టలేకపోయారు.

Read Also: Viral: బాయ్‌ఫ్రెండ్‌ని పెట్టెలో దాచి పెట్టిన యువతి.. చివరికి ఏమైందంటే..?

మరోవైపు.. ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్ గత సీజన్‌లో అరంగేట్రం చేసి తొమ్మిది వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ సుమిత్ మాథుర్‌ను జట్టులోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ఢిల్లీ జట్టుకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. సుదర్శన్ 249 బంతుల్లో డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. సాయి సుదర్శన్ 2023 నుంచి పాకిస్తాన్‌-ఏపై, ఇంగ్లండ్‌-ఏపై, ఐపీఎల్‌లో, తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ నాకౌట్స్‌లో, కౌంటీ క్రికెట్‌లో, దులీప్‌ ట్రోఫీలో, రంజీ ట్రోఫీలో సెంచరీలతో రాణిస్తున్నాడు. 23 ఏళ్ల సాయి సుదర్శన్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడి 6 సెంచరీలు చేశాడు. అలాగే లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 28 మ్యాచ్‌లు ఆడి ఆరు సెంచరీలు కొట్టాడు.

Read Also: Gujarat: రూ. 1.07 కోట్ల చోరీలో దొంగల్ని పట్టించిన పోలీస్ జాగిలం..