Sai Praneeth Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ షట్లర్ సాయి ప్రణీత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Praneeth announces retirement from badminton: భారత షట్లర్ బీ సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని 31 ఏళ్ల ప్రణీత్ ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. గత కొణతకాలంగా ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. తన సుదీర్ఘ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. అమెరికాలో ఒక క్లబ్‌కు సేవలు అందించబోతున్నట్లు తన ప్రణీత్ వివరించాడు.
‘డియర్ బ్యాడ్మింటన్ థాంక్యూ. బ్యాడ్మింటన్‌తో 24 ఏళ్లకు పైగా ఉన్న సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలుకుతూ.. రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఈ రోజు నుంచి కెరీర్‌లో కొత్త చాప్టర్ మొదలుపెడుతున్నా. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన ప్రతిఒక్కరికి రుణపడి ఉంటాను. అభిమానుల అపూర్వ మద్దతు నా గొప్ప బలం. భారత జెండా ఎగిరినప్పుడల్లా నా ఆత్మవిశ్వాసం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. బ్యాడ్మింటన్ ఆటపై నాది తొలి ప్రేమ. నేను గుర్తింపులోకి వచ్చింది ఈ ఆట ద్వారా మాత్రమే. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులు, మరెన్నో అడ్డంకులను అధిగమించాను. అవి నా హృదయంలో పదిలంగా ఉంటాయి. నా తల్లిదండ్రులు, భార్య శ్వేత కెరీర్ ఉన్నతికి ఎంతగానో దోహదపడ్డారు. గోపీచంద్ అన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆటతో నా అనుబంధం కొనసాగుతుంది. ప్లేయర్‌గా గాకుండా కోచ్‌గా, మెంటార్‌గా ఏదో ఒక రూపంలో ఆటలో భాగమవుతా’ అని సాయి ప్రణీత్ పేర్కొన్నాడు.
Also Read
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
2017లో సింగపూర్ ఓపెన్ గెలిచిన సాయి ప్రణీత్.. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10 ర్యాంకింగ్స్‌లో నిలువడంతో ప్రతిష్ఠాత్మక టోక్యో (2020) ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అయితే ఆడిన మూడు లీగ్ మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో మెయిన్ డ్రాకు అర్హత సాధించలేకపోయాడు. అప్పటినుంచి గాయాల పాలవుతున్న ప్రణీత్.. పూర్తి స్థాయిలో ఆటతీరు ప్రదర్శించడంలో విఫలమవుతూ వచ్చాడు. ఓవైపు యువ షట్లర్లతో పోటీ, ఫిట్‌నెస్ సమస్యలు అతడి కెరీర్‌కు ప్రతిబంధకంగా మారాయి.
Also Read: Ae Watan Mere Watan : నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న సారా అలీ ఖాన్ మూవీ..
సాయి ప్రణీత్ తన కెరీర్‌లో సింగపూర్ ఓపెన్, కెనడా ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్ టైటిళ్లను సాధించాడు. ప్రణీత్‌ను భారత ప్రభుత్వం 2019లో అర్జున అవార్డుతో సత్కరించింది. ప్రణీత్ తన కెరీర్ మొత్తంలో 225 విజయాలు సాధించగా.. 151 పరాజయాలను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 46 స్థానంలో ఉన్నాడు. 2019లో అత్యుత్తమంగా 10వ ర్యాంక్‌కు సాధించాడు.
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!