NTV Telugu Site icon

Sai Durga Tej : పక్కా ప్లానింగుతో ప్యామిలీ ప్యాక్ లేపేసిన మెగా హీరో

Sai Dharam Tej Instructions To Megafans

Sai Dharam Tej Instructions To Megafans

Sai Durga Tej : హీరో ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తినే విషయంలో ఇప్పుడంటే కాస్త మొహమాట పడతాడేమో గానీ అప్పట్లో మాత్రం కుమ్మేసేవాడు. బావర్చీ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒక్కడినే తినేస్తానని చెప్పిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇండ‌స్ట్రీలో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు ఉన్న ప‌ళంగా లేపేసిన చ‌రిత్ర ఎవ‌రికైనా ఉందంటూ అది యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పేరే. తార‌క్ ఎలా తినేవారో? త‌న తిండి గురించి తానే స్వయంగా చెప్పుకున్న సందర్భాలు కోకొల్లలు. కొన్ని ద‌శాబ్దాల కింద‌కు వెళ్తే హైద‌రాబాద్ బిర్యానీ తిన‌డంలో తానో స్పెష‌ల్ గా భావించేవారు. నెయ్యిలో, వెన్నలో ఇడ్లీలు ముంచుకుని తిన‌డం? ఇలా ఒక‌టేంటి తార‌క్ ఒక‌ప్పుడు పుష్టిగా భోజనం చేసేవాడు. అయితే ఇప్పుడా అల‌వాటును ఆయన పూర్తిగా మానేసుకున్నారు.

Read Also:India-Canada: కెనడాలో దాడులు.. కాన్సులర్‌ క్యాంప్‌లు క్యాన్సిల్ చేసిన భారత్‌

సినిమాల కోసం ఆయన ఇప్పుడు వెయిట్ ఎలా త‌గ్గాలి? అంటే తార‌క్ ని టిప్ అడిగితే చాలు. సింపుల్ గా తిన‌డం త‌గ్గించుకుంటే చాలు.. ఆటోమేటిక్ గా బరువు దానంతట అదే ఇట్టే తగ్గిపోతుందని చెబుతుంటారు. ఇక ఎన్టీఆర్ ఇంటికొచ్చిన అతిథులకు తానే స్వయంగా బిర్యానీ చేసి వడ్డిస్తారు. ఆవిష‌యంలో క‌ల్యాణ్ రామ్ స‌హా వెళ్లే అతిథులంతా ఎంతో ల‌క్కీ. ఆదివారం వ‌చ్చిందంటే క‌ళ్యాణ్ రామ్ తార‌క్ ఇంట్లోనే బిర్యానీ రుచులు ఆస్వాదిస్తుంటారు.

Read Also:IPL Auction 2025: ఇది తెలుసా.. ఐపీఎల్‌ వేలంలో ఇటలీ ఆటగాడు!

ఆ త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం మంచి భోజ‌న ప్రియుడన్న మాట తెలిసిందే. ముక్క లేనిదే ముద్ద దిగ‌ద‌నే టైపు. అత‌డి మెనులో రోజూ అన్ని ర‌కాల వెజ్-నాన్ వెజ్ వంటలు ఉండాల్సిందే. వీళ్లంద‌ర్నీ ప‌క్కన పడితే ఎన్టీఆర్ లా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ప్యాకెట్ లు లేపేసే హీరో ఇంకేవరైనా ఉన్నారా? అంటే మెగా మేన‌ల్లుడు సాయి దుర్గ తేజ్ అదే టైప్ అంటున్నారు. హీరో కాక ముందు తాను 130 కిలోల బ‌రువు ఉండేవాడట. అలా ఎందుక‌య్యారంటే? ప్యామిలీ ప్యాక్ బిర్యానీ ఒక్కడినే తినేస్తే అలాగే అవుతామ‌ని స‌మాధానం ఇచ్చాడు. ఈ విష‌యం ఇంత‌వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు. ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా సాయి దుర్గా తేజ్ రివీల్ చేశాడు. అయితే సాయిదుర్గా తేజ్ ఇండస్ట్రీకి వ‌చ్చే ముందే స్లిమ్ లుక్ మారిపోయాడు. పూర్తిగా హీరోయిక్ లుక్ లో ట్రాన్సఫర్ అయిన తర్వాతే మేకప్ వేసుకున్నాడు.

Show comments