Jharkhand : బాయ్‌ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిన నలుగురు పిల్లల తల్లి..చెప్పుల దండేసి ఊరేగించిన స్థానికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand : ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి అని అంటారు. కానీ ఈ ప్రేమ అక్రమ సంబంధంగా మారితే, దాని భయంకరమైన రూపం కనిపిస్తుంది. ఇలాంటి ఘటనే జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక్కడ నలుగురు పిల్లల తల్లిని తన బెడ్రూమ్లో మరో యువకుడితో అభ్యంతరకర పరిస్థితుల్లో గ్రామస్థులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత ఇద్దరినీ బయటకు లాగారు. అనంతరం చెప్పుల దండవేసి రోడ్డుపై ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రేమ జంట వీడియో వైరల్ కావడంతో.. సాహిబ్‌గంజ్ జిల్లా పోలీసులు ఇప్పుడు నిందితులను గుర్తించారు. వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ విషయం మీర్జాచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని బచా పంచాయతీ గ్రామానికి సంబంధించినది. సమాచారం మేరకు ఇక్కడ నివాసముంటున్న 40 ఏళ్ల వివాహిత అదే గ్రామానికి చెందిన యువకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. మహిళకు నలుగురు పిల్లలు కాగా భర్త వేరే రాష్ట్రంలో పనిచేస్తున్నాడు. ఆ మహిళ తన ప్రేమికుడిని రహస్యంగా కలుసుకునేది. అయితే ఇంతలో వీరి ఎఫైర్ గురించి జనాలకు తెలిసింది. ఒకరోజు ఆమె ప్రేమికుడు ఆమె ఇంటికి వచ్చాడు. బెడ్రూమ్లో ప్రేమాయణం సాగిస్తున్న వీరిద్దరినీ గ్రామస్థులు పట్టుకున్నారు. గ్రామస్తులు వారిద్దరినీ బయటకు లాగారు. ముందుగా అతడిని కొట్టి, చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు.
Also Read
- AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వడ్డీ లేని రుణం..
- Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
- Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
- Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
15 నుంచి 20 మందిపై ఎఫ్ఐఆర్
ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పులు కూడా వాయించారు. దీన్ని కొందరు వీడియో తీసి వైరల్ చేశారు. ఈ వీడియో పోలీసులకు చేరడంతో వారు విచారణకు పంపించారు. ఈ ఘటనపై ఓ వాచ్మెన్ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశాడు. పోలీసులు 15 నుంచి 20 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఎస్పీ ఏం చెప్పారు?
సాహిబ్‌గంజ్ జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ – మీర్జా చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడిని, వివాహితను అవమానించిన కేసు వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు ఎస్డీపీఓ సాహిబ్‌గంజ్ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. కేసులో చర్యలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వడ్డీ లేని రుణం..
-
Vijay Varma: హీరో కాకముందు కాస్టింగ్ కౌచ్.. విజయ్ వర్మ షాకింగ్ వ్యాఖ్యలు.. హైదరాబాద్‌లో జరిగిన ఘటన ఏంటి?
-
Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
-
Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
-
Salman Khan: రూ.120 కోట్ల నుంచి రూ.70 కోట్లకు సల్మాన్ పారితోషికం.. అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!