భవన నిర్మాణ కార్మికులుగా వివిధ పనులు చేస్తూ జీవనం సాగించే సగరులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆకాంక్షించారు. సోమవారం నాడు సాయంత్రం ఏర్పాటు చేసిన గన్నవరం నియోజకవర్గ స్థాయి సగరుల ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా శ్రీశ్రీశ్రీ భగీరథ మహర్షి చిత్రపటానికి నివాళులర్పించి యార్లగడ్డ మాట్లాడుతూ.. భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగించే సగరులకు టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం సగర కులస్తుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. ఎన్డీయే ప్రభుత్వంలోనే బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో బడుగు బలహీన వర్గాలపై దాడులు చేయటం తప్ప వారి అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదు అని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.
Read Also: Kejriwal: వ్యక్తిగత వైద్యుడి కోసం కేజ్రీవాల్ పిటిషన్.. ఈడీ ఏం చెప్పిందంటే..!
ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గన్నవరం నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలుపుతానని యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కరిస్తాను, స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. నియోజకవర్గంలోని అర్హులైన 15 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తానని చెప్పారు. సగరులందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా, గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి బాలశౌరిని ఎంపీగా గెలిపించాలని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు విజ్ఞప్తి చేశారు.
Read Also: Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఇక, ఈ కార్యక్రమంలో సగర సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు జంపన వీర శ్రీనివాసరావు, సగర సాధికార సమితి జిల్లా అధ్యక్షులు తాడిశెట్టి వీరస్వామి, రాష్ట్ర సభ్యులు నక్క వెంకటేశ్వరరావు, కురాకు వెంకటయ్య, కర్నాటి నాగర్జునరావు, నక్క సుబ్బారావు, గండికోట గోవర్ధన్, ఊటుకూరి త్రిమూర్తులు, రెడ్డి రాంబాబు, గుర్రం వెంకటేశ్వరావు, గుర్రం నరసింహారావు, గుర్రం గోపినాథ్, తాడిశెట్టి వెంకటేశ్వరరావు, తాడిపర్తి నాగప్రసాద్, తాడిశెట్టి శ్రీనివాసరావు, తాళ్ళపాక వేణుగోపాల్, పందేటి తిరుపతయ్య, వల్లిబోయిన సత్యనారాయణ, గుర్రం సుబ్బారావు, కొండా రాంబాబు, తాడిశెట్టి రామకృష్ణ, నక్క సాంబశివరావు, నక్క రామకృష్ణ, నక్క వెంకట్, నియోజకవర్గ సగర కుల సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.