NTV Telugu Site icon

Sagar Canal : సాగర్‌ కాలువకి మళ్లీ గండి.. నీటి విడుదల నిలిపివేత

Sagar Canal

Sagar Canal

పాలేరు నుంచి సాగర్ కాలువలకి గత నెలలో వచ్చిన వరదల వల్ల గండ్లు పడటంతో ఆ గండ్లని పూడ్చివేశారు. అయితే గండ్లను పూడ్చి నీళ్లు విడుదల చేసినప్పటికీ వెంటనే మళ్ళీ గండి పడింది. దీంతో మళ్ళీ నీటి విడుదలని నిలిపివేశారు. గత నెల 30 ,31 తేదీల్లో భారీ ఎత్తున ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చాయి. ఈ వరదలు తో పాలేరు నుంచి దిగువకి నాగార్జునసాగర్ కాలువల కు గండ్లు పడ్డాయి. పాలేరు వద్ద ఒకే చోట మూడు చోట్ల  సాగర్ కాలువలకు భారీ గండ్లు పడ్డాయి .అయితే ఈ గండ్లని పూడ్చటంలో అధికార యంత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి. గండ్లని వెంటనే పూడ్చిరైతులకు సాగునీటిని ఇవ్వాలని ముగ్గురు మంత్రులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు కాంట్రాక్టర్లు చాలా నిర్లక్ష్యంగా పనులు చేశారన్న విమర్శలు ఉన్నాయి.

Cyber Fraud: అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షలు..! ట్విస్ట్ ఏంటంటే..?

ఈ నేపథ్యంలో గత నెల 31 తారీఖు నాడు గండ్లు పడితే 20 రోజులైనప్పటికీ గంటలను పూడ్చలేకపోయారు. దీంతో సాగర్ ఆయకట్ట కింద పంటలు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులపై ఒత్తిడి పెరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం గండ్లను పూర్తి నేటిని విడుదల చేశారు .పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన మరుక్షణమే ఇంతకుముందు పడ్డ గండి సమీపంలోని మరొక బుంగ పడింది .దీంతో మళ్ళీ నీటి విడుదలని నిలిపివేశారు రేపు కాని మళ్లీ గండి పూడ్చివేత సాధ్యం కాదు. సాగర్ నీరు విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంతో సాగర్ రాయకట్టు కింద రెండున్నర లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో పంట ఎండిపోయింది….

Bengaluru: బెంగళూర్‌లో మరో శ్రద్ధావాకర్.. ఫ్రిజ్‌లో 32 ముక్కలుగా మహిళ శరీర భాగాలు..