Tamilnadu: గవర్నర్‌ను తక్షణమే బర్తరఫ్ చేయండి.. రాష్ట్రపతికి అధికార డీఎంకే మెమోరాండం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: గవర్నర్ ఆర్ఎన్ రవిని శాంతికి ముప్పు అని పేర్కొంటూ, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుతూ తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించింది. ఆయన మత విద్వేషాన్ని రెచ్చగొట్టాడని డీఎంకే ఆరోపించింది. రాజ్యాంగాన్ని గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఉల్లఘించారని డీఎంకే పార్టీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన మెమోరాండంలో పేర్కొంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో ఆయన అనవసరంగా జాప్యం చేస్తున్నారని ఆరోపించింది. ప్రభుత్వం పట్ల అసంతృప్తిని ప్రేరేపించడానికి ఆయన ప్రకటనలు ప్రయత్నిస్తున్నందున దేశద్రోహంగా కూడా పరిగణించవచ్చని ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే పేర్కొంది. ఆర్‌ఎన్ రవి రాజ్యాంగ పదవికి అనర్హుడని పేర్కొంది. ఆయన పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతిని కోరింది. దీనిపై గవర్నర్ ఆర్‌ఎన్ రవి స్పందించలేదు. ఆర్‌ఎన్ రవిని తొలగించాలని కోరుతూ వచ్చిన ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని డీఎంకే ఈ నెల ప్రారంభంలో పలువురు ఎంపీలకు కూడా లేఖ రాసింది.
Justice Chandrachud: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం
Also Read
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
తమిళనాడులో 20 బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం వేచి ఉన్నాయి. గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించవచ్చు లేదా తొలగించవచ్చునని చట్టం చెబుతోంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం కోసం బిల్లును పంపితే, గవర్నర్ దానిని ఒకసారి వెనక్కి పంపవచ్చు. కేబినెట్ బిల్లును గవర్నర్‌కు మళ్లీ పంపితే, వారు దానిని వెనక్కి పంపలేరు. ఈ గవర్నర్లు కేంద్రం చేతిలో తోలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని, వారి చర్యల వెనుక బీజేపీ మద్దతు ఉందని, రాజకీయ ప్రతీకారాన్ని చూపిస్తున్నారని పార్టీ నాయకులు ఆరోపించారు. తమిళనాడు విషయంలోనూ తెలంగాణ గవర్నర్ జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికార బాధ్యతలు స్వీకరించడానికి ముందు తమిళనాడులో బీజేపీ సీనియర్ నాయకురాలిగా ఉన్నారని, ఆమె రాష్ట్ర రాజకీయాల్లో కూడా కలగజేసుకున్నారని డీఎంకే ఆరోపించింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో నియామకాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!