NTV Telugu Site icon

World Cup 2023: సచిన్ రికార్డు బ్రేక్.. రచిన్ అరుదైన ఘనత

Rachin

Rachin

World Cup 2023: వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈరోజు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో కివీస్ స్టార్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర అరుదైన ఫీట్ సాధించాడు. వన్డే వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రచిన్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్ లో రచిన్ రవీంద్ర 42 రన్స్ చేసి ఔటయ్యాడు.

Read Also: Mohammed Shami: షమీకి పెళ్లి ప్రపోజ్.. ట్వీట్ చేసిన బాలీవుడ్ నటి

ఈ మెగా టోర్నీలో రచిన్ ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌లలో 565 పరుగులు చేశాడు. కాగా.. ఇంతకుముందు ఈ అరుదైన రికార్డు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండేది. ఆయన 1996 వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో 523 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో సచిన్‌ 27 ఏళ్ల రికార్డును రచిన్‌ బద్దలు కొట్టాడు. అలాగే వరల్డ్‌కప్‌ 2023లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కూడా రవీంద్రనే ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు, 2 అర్ధ శతకాలు ఉన్నాయి.

Read Also: DA Hike: ఉద్యోగులకు డీఏ పెంచిన ప్రభుత్వాలు.. ఏఏ రాష్ట్రాలు ఉన్నాయంటే..!

ఇక న్యూజిలాండ్-శ్రీలంక మ్యాచ్ లో గెలుపు దిశగా ముందుకెళ్తుంది. 22 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఇంక కివిస్ కు కావాల్సింది 15 పరుగులు మాత్రమే. ప్రస్తుతం క్రీజులో డేరిల్ మిచెల్ 39, గ్లేన్ ఫిలిప్స్ 9 పరుగులతో ఉన్నారు.

Show comments