NTV Telugu Site icon

Sabitha Indra Reddy : విద్యార్థులందరూ కూడా పరీక్షకు ప్రశాంతమైన వాతావరణంలో హాజరకండి

Sabitha Indrareddy

Sabitha Indrareddy

వచ్చే నెల మూడో తేదీ నుంచి 13వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. అయితే.. వేసవికాలం తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆమె మాట్లడుతూ.. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షకు నాలుగు లక్షల 94 వేల620 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఆమె వెల్లడించారు.

Also Read : IPL 2023 Opening Ceremony: ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు టాలీవుడ్ హీరోయిన్స్

అయితే.. విద్యార్థులత కోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. 9:35 నిమిషాల వరకు మాత్రమే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారని ఆమె సూచించారు. ఇప్పటికీ హాల్ టికెట్లు పాఠశాలలకు పంపించడం జరిగింది హాల్ టికెట్ అందరి విద్యార్థులు వెబ్సైట్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులకు హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేయవచ్చని ఆమె తెలిపారు. విద్యార్థులందరూ కూడా పరీక్షకు ప్రశాంతమైన వాతావరణంలో హాజరకండని, పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్ఎం లతో పాటు ఓఆర్ఎస్ పాకెట్స్ ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.

Also Read : Bandi Sanjay : నీ పరువుకే రూ.100 కోట్లయితే.. లీకేజీలో నా కుట్ర ఉందన్న నీపై ఎంత దావా వేయాలి?