NTV Telugu Site icon

Sabitha Indra Reddy : కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకుపోవాలి

Sabitha Indrareddy

Sabitha Indrareddy

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధి లోని కందుకూరు మండలం సామ నర్సింహారెడ్డి గార్డెన్‌లో భారత రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకపోవాలని ఆమె కోరారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు మంచి గుర్తింపు ఉంటుందని ఆమె అన్నారు.

Also Read : KKR vs PBKS : కోల్‌క‌తాపై 7 ప‌రుగుల తేడాతో పంజాబ్ విజ‌యం

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఆమె వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నాయని ఆమె తెలిపారు. అనంతరం, కందుకూరు మండలంలో 70 మంది లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభూత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎంపీపీ , ఆర్డిఓ, స్థానిక బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read : Bandi Sanjay : తెలంగాణ దేనికి మోడల్ కేసీఆర్..? రైతుల ఆత్మహత్యల్లోనా.. మాట తప్పడంలోనా..?