Site icon NTV Telugu

Sabitha Indra Reddy : ఎక్కడా లేనివిధంగా పేద ప్రజలు డబుల్‌ బెడ్‌ రూంలు

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అతి ముఖ్యమైన ఘట్టమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు కాప్రా మండల పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో, కీసర మండల పరిధిలోని రాంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కాప్రా మండల పరిధిలో గల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి స్థానిక కార్పొరేటర్లు, కీసర మండల పరిధిలో గల రాంపల్లిలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Also Read: PM Modi: కాంగ్రెస్ ప్రజల కన్నా తన ఓటు బ్యాంకునే ఎక్కువగా ప్రేమిస్తుంది..

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించడానికి మా ప్రియతమ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు చేపట్టిన ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం మొదట్లో అవుతుందో కాదు అన్న అనుమానంతో ఉన్న ప్రజలకు నమ్మకం కలిగిస్తూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టి కల సహకారం చేశారు అని ఆమె తెలిపారు. ఈ సందర్భంలోనే ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలోని జమ్మిగడ చర్లపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ సింగం తండా ఆదర్శ్ నగర్ రాంపల్లిలో ఇప్పటివరకు 2845 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని పంపిణీ చేశామని ఈ ఒక్క రోజే 1500 పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను డ్రా ద్వారా పంపిణీ చేశామని ఆయన తెలిపారు. రాంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులను వాళ్ళ అభిప్రాయం చెప్పమంటే చెప్పేది ఏం లేక ఏడుస్తూ తమ ఆనంద భాష్పాలను కారుస్తూ ప్రభుత్వానికి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారని ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన కేసీఆర్ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.

Also Read : Ram Charan: ఆ తోపు డైరెక్టర్ తో చరణ్.. అంటే అన్నారు కానీ, ఆ ఊహ ఎంత బావుందో.. ?

Exit mobile version