NTV Telugu Site icon

Sabitha Indra Reddy : ప్రజా పాలన అంటే.. ఇదేనా రేవంత్ రెడ్డి..?

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy : కానిస్టేబుల్స్ కుటుంబాలు రోడ్డు మీదకు రావటానికి సీఎం రేవంత్ కారణమని ఆరోపించారు మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఇవాళ తెలంగాణ భవన్ లో సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హోంశాఖ నిర్వహిస్తోన్న రేవంత్ ఫెయిల్ అవ్వటం వలనే పోలీస్ కుటుంబాలు బయటకు వచ్చాయని, రక్షకభటులే న్యాయం కావాలని రోడ్డు ఎక్కటం బాధాకరమన్నారు. పోలీసులు రోడ్డు ఎక్కటం చరిత్రలోనే మెదటసారి అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజా పాలన అంటే.. ఇదేనా రేవంత్ రెడ్డి? అని ఆమె ప్రశ్నించారు. హోంమంత్రి లేకపోవటం వల‌న.. కానిస్టేబుల్స్ బాధ ఎవరకి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి అని, యూనిఫాం వేసుకుని ధర్నాలు చేయాల్సిన పరిస్థితి తెలంగాణలో వచ్చిందని ఆమె మండిపడ్డారు.

KA Movie: దీపావళికి ఒక్క తెలుగులోనే ‘క’ రిలీజ్.. ఎందుకంటే?

అంతేకాకుండా.. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరమని సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఏక్ పోలీస్ వ్యవస్థపై సీఎం రేవంత్ మాటను నిలబెట్టుకోవాలని, 18రోజులకు‌… 4రోజులు కుటుంబంతో గడిపే పాత పద్దతిని కొనసాగించాలన్నారు. పిల్లలు కూడా తండ్రులను గుర్తుపట్టని పరిస్థితులు పోలీస్ కుటుంబాలవని, మహిళలపై అఘాయిత్యాలు రాష్ట్రంలో సర్వసాధారణంగా మారాయన్నారు సబితా ఇంద్రారెడ్డి. డీజీపీ స్థాయి అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు.

Milk: పాలు తాగడం వల్ల ఊబకాయం పెరుగుతుందా..? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు