Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala Special Trains: అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమల వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. శబరిమల క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 22 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్-కొల్లం, నర్సాపూర్-కొట్టాయం, కాచిగూడ-కొల్లం, కాకినాడ టౌన్-కొట్టాయం, కొల్లం-సికింద్రాబాద్‌ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో పలు క్లాస్‌ల కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక రైళ్ల తేదీలు.. టైమింగ్స్ ఇవే..

Also Read
ఈ ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే..
సికింద్రాబాద్ -కొల్లం-సికింద్రాబాద్ (07129/07130) రైళ్లు.. నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిసూర్, ,ఆలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనస్సెరి, తిరువళ్ల, చెంగనూర్, మావెలికెర స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనుంది.
నర్సాపూర్-కొట్టాయం-నర్సాపూర్ (07119/07120) ప్రత్యేక రైళ్లు.. భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలర్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, ఆలువా, ఎర్నాకుళం టౌన్ మీదుగా రాకపోకలు కొనసాగించనుంది.
కాచిగూడ-కొల్లం-కాచిగూడ (07123/07124) రైళ్లు.. మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిసూర్, ఆలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనస్సెరి, తిరువళ్ల, చెంగనూర్, మావెలికెర స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనుంది.
కాకినాడ టౌన్ -కొట్టాయం-కాకినాడ (07126/07126) ప్రత్యేక రైళ్లు.. సామల్‌కోట్, అనపర్తి, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పడి, జోలర్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిసూర్, ఆలువా, ఎర్నాకుళం టౌన్ స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనుంది.
సికింద్రాబాద్ -కొల్లం-సికింద్రాబాద్(07127/07128) ప్రత్యేక రైళ్లు.. కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, శ్రీరామ్‌నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలర్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిసూర్, ఆలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనస్సెరి, తిరువళ్ల, చెంగనూర్, మావెలికెర స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనుంది.
తాజావార్తలు
-
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?