NTV Telugu Site icon

Temba Bavuma: నెదర్లాండ్స్‌ ఓటమిని మర్చిపోవడానికి ప్రయత్నించను.. చాలా బాధపడాలి: టెంబా బవుమా

Temba Bavuma Interview

Temba Bavuma Interview

South Africa Captain Temba Bavuma React on Netherlands Defeat: వన్డే ప్రపంచకప్ 2023లో నెదర్లాండ్స్‌పై ఘోర పరాజయం తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా తన బాధను దాచుకునే ప్రయత్నం అస్సలు చేయలేదు. నెదర్లాండ్స్‌ ఓటమిని మర్చిపోవడానికి ప్రయత్నించనని, ఇంకా చాలా బాధపడాలి అని అన్నాడు. తాము మళ్లీ గాడిన పడుతామని, మెగా టోర్నీలో తమా ప్రయాణం సాఫీగా కొనసాగిస్తామని బావుమా ధీమా వ్యక్తం చేశాడు. నెదర్లాండ్స్‌ అద్భుతంగా ఆడిందని, అన్ని విభాగాల్లో తమపై పైచేయి సాధించిందని పేర్కొన్నాడు. నెదర్లాండ్స్‌ నిర్ధేశించిన 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటై ఘెర పరాభవాన్ని మూటగట్టుకుంది.

మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మాట్లాడుతూ… ‘భావోద్వేగాలను లోపలే దాచుకోవాలి. ఈ ఓటమి బాధిస్తుంది.. చాలా బాధపడాలి. మేం మళ్లీ తిరిగి వస్తాం. ప్రపంచకప్ 2023లో మా ప్రయాణం ఇంకా ముగియలేదు. ఓడింది ఒకటే మ్యాచ్. ఎక్స్‌ట్రాలు నియత్రించాల్సింది. 32 ఎక్స్‌ట్రాలు అంటే ఐదు ఓవర్‌లు అదనంగా బౌలింగ్ చేయడమే. ఇది జట్టుకు ఏ మాత్రం మంచిది కాదు. దీనిపై మేం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఆస్ట్రేలియాపై బాగా ఆడాం. ఆ ప్రదర్శనను పునరావృతం చేయడమే సవాలుగా మారింది. మా ఫీల్డింగ్ ప్రామాణికంగా లేదు’ అని అన్నాడు.

Also Read: Divorce Celebration: అచ్చు పెళ్లి బరాత్‌ మాదిరే.. కూతురుకి విడాకుల ఊరేగింపు చేసిన తండ్రి!

‘నెదర్లాండ్స్‌ 112 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో మేము మ్యాచ్‌పై పట్టు సాధించాం. ఆ సమయంలో వారు 200 స్కోర్ చేయరు అనుకున్నాం. కానీ మా బౌలర్లు పట్టు కోల్పోయారు. దాంతో నెదర్లాండ్స్‌ 240 ప్లస్‌ స్కోర్ చేసింది. డచ్‌ నిర్ధేశించిన లక్ష్యాన్ని మేం ఛేదించగలమని భావించాం. అయితే డచ్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. మాపై ఒత్తిడి తీసుకొచ్చి.. వికెట్లు కోల్పోయేలా చేశారు. మాకు మంచి భాగస్వామ్యాలు నమోదుకాలేదు. పవర్‌ప్లేలో డబుల్ స్పిన్‌తో మమల్ని దెబ్బతీశారు. నెదర్లాండ్స్‌కు శుభాకాంక్షలు. అద్భుతంగా ఆడారు. అన్ని విభాగాల్లో మాపై పైచేయి సాధించారు’ అని టెంబా బావుమా తెలిపాడు.

Show comments