Temba Bavuma: నెదర్లాండ్స్ ఓటమిని మర్చిపోవడానికి ప్రయత్నించను.. చాలా బాధపడాలి: టెంబా బవుమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Africa Captain Temba Bavuma React on Netherlands Defeat: వన్డే ప్రపంచకప్ 2023లో నెదర్లాండ్స్‌పై ఘోర పరాజయం తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా తన బాధను దాచుకునే ప్రయత్నం అస్సలు చేయలేదు. నెదర్లాండ్స్ ఓటమిని మర్చిపోవడానికి ప్రయత్నించనని, ఇంకా చాలా బాధపడాలి అని అన్నాడు. తాము మళ్లీ గాడిన పడుతామని, మెగా టోర్నీలో తమా ప్రయాణం సాఫీగా కొనసాగిస్తామని బావుమా ధీమా వ్యక్తం చేశాడు. నెదర్లాండ్స్ అద్భుతంగా ఆడిందని, అన్ని విభాగాల్లో తమపై పైచేయి సాధించిందని పేర్కొన్నాడు. నెదర్లాండ్స్ నిర్ధేశించిన 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటై ఘెర పరాభవాన్ని మూటగట్టుకుంది.
మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మాట్లాడుతూ… ‘భావోద్వేగాలను లోపలే దాచుకోవాలి. ఈ ఓటమి బాధిస్తుంది.. చాలా బాధపడాలి. మేం మళ్లీ తిరిగి వస్తాం. ప్రపంచకప్ 2023లో మా ప్రయాణం ఇంకా ముగియలేదు. ఓడింది ఒకటే మ్యాచ్. ఎక్స్‌ట్రాలు నియత్రించాల్సింది. 32 ఎక్స్‌ట్రాలు అంటే ఐదు ఓవర్‌లు అదనంగా బౌలింగ్ చేయడమే. ఇది జట్టుకు ఏ మాత్రం మంచిది కాదు. దీనిపై మేం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఆస్ట్రేలియాపై బాగా ఆడాం. ఆ ప్రదర్శనను పునరావృతం చేయడమే సవాలుగా మారింది. మా ఫీల్డింగ్ ప్రామాణికంగా లేదు’ అని అన్నాడు.
Also Read
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
Also Read: Divorce Celebration: అచ్చు పెళ్లి బరాత్ మాదిరే.. కూతురుకి విడాకుల ఊరేగింపు చేసిన తండ్రి!
‘నెదర్లాండ్స్ 112 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో మేము మ్యాచ్‌పై పట్టు సాధించాం. ఆ సమయంలో వారు 200 స్కోర్ చేయరు అనుకున్నాం. కానీ మా బౌలర్లు పట్టు కోల్పోయారు. దాంతో నెదర్లాండ్స్ 240 ప్లస్ స్కోర్ చేసింది. డచ్ నిర్ధేశించిన లక్ష్యాన్ని మేం ఛేదించగలమని భావించాం. అయితే డచ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మాపై ఒత్తిడి తీసుకొచ్చి.. వికెట్లు కోల్పోయేలా చేశారు. మాకు మంచి భాగస్వామ్యాలు నమోదుకాలేదు. పవర్‌ప్లేలో డబుల్ స్పిన్‌తో మమల్ని దెబ్బతీశారు. నెదర్లాండ్స్‌కు శుభాకాంక్షలు. అద్భుతంగా ఆడారు. అన్ని విభాగాల్లో మాపై పైచేయి సాధించారు’ అని టెంబా బావుమా తెలిపాడు.
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!