SA vs AUS: మిచెల్ స్టార్క్ కన్నెర్ర.. సౌతాఫ్రికా ఆలౌట్!
- కేప్‌టౌన్ వేదికగా మూడో టెస్టు..
- తొలి రోజే సౌతాఫ్రికా 329 పరుగులకు ఆలౌట్
- మిచెల్ స్టార్క్ 16.3 ఓవర్లలో 72 పరుగులకు 6 వికెట్లు
- చివరి నాలుగు వికెట్లను సౌతాఫ్రికా కేవలం 2 పరుగుల వ్యవధిలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SA vs AUS: ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టు తొలి రోజే తీవ్ర ఉత్కంఠను రేపింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) నిప్పులు చెరిగే బంతులతో చుక్కలు చూపించాడు. ఒకానొక దశలో భారీ స్కోరు దిశగా సాగిన దక్షిణాఫ్రికా.. చివర్లో స్టార్క్ ధాటికి పేకమేడలా కుప్పకూలి తొలి రోజే 82.3 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. మార్క్స్ అకెర్మాన్ టి20 తరహా దూకుడుతో 94 బంతుల్లోనే 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 95 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరోవైపు మరో ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ 141 బంతుల్లో, 10 ఫోర్లు, 1 సిక్స్ తో 78 పరుగులతో నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 158 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు బలమైన పునాది వేశారు. ఆ తర్వాత వచ్చిన డేవిడ్ బెడింగ్హామ్ కూడా అర్ధసెంచరీతో రాణించాడు.
Also Read
- Cyclone Arnab: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
- Bandi Sanjay: కరువు మండలాల జాబితాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం..
- Cyclone Arnab Landfall: తీరం దాటిన అర్నబ్ తుఫాన్.. మరో 6–7 గంటలు కీలకం!
- Cyclone Arnab: అలర్ట్.. ఏపీని వణికిస్తున్న తుఫాను.. అర్నబ్ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ.. భారీ వర్ష సూచన..
అయితే కెప్టెన్ తెంబ బవుమా (0), మాథ్యూ బ్రీట్జ్కే (2), వియాన్ ముల్డర్ (0) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరడంతో ప్రొటీస్ 232 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ర్యాన్ రికెల్టన్ (42), మార్కో జాన్సెన్ (52) బాధ్యతాయుతంగా ఆడుతూ ఏడో వికెట్‌కు 95 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని జోడించారు. వీరిద్దరి పోరాటంతో సౌతాఫ్రికా స్కోరు 320 దాటింది. ఇక్కడే అసలు సినిమా మొదలైంది. రెండో కొత్త బాల్ రాగానే మిచెల్ స్టార్క్ తన ప్రతాపం చూపించాడు. 81వ ఓవర్లో రికెల్టన్, జాన్సెన్ ఇద్దరినీ ఔట్ చేసిన స్టార్క్.. ఆ తర్వాత తన మరుసటి ఓవర్లో గెరాల్డ్ కొయెట్జీ (0), కగిసో రబాడా (0)లను పెవిలియన్ పంపాడు. దీంతో సౌతాఫ్రికా కేవలం 2 పరుగుల తేడాలోనే చివరి 4 వికెట్లను కోల్పోయింది. దీనితో 327/6 ఉన్న స్కోర్ బోర్డు కాస్త 329/10 కి చేరుకుంది. స్టార్క్ 16.3 ఓవర్లలో 72 పరుగులిచ్చి 6 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇతర ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ 2 వికెట్లు తీయగా.. జోష్ హేజిల్‌వుడ్, కూపర్ కానోలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.
3 minutes of extraordinary pace bowling by Mitchell Starc.
Take a bow 🙇♂️ https://t.co/Sopph7SPa8
— Troll cricket unlimitedd (@TUnlimitedd) October 27, 2026
తాజావార్తలు
-
SA vs AUS: మిచెల్ స్టార్క్ కన్నెర్ర.. సౌతాఫ్రికా ఆలౌట్!
-
Bengaluru Metro: “నేను వణికిపోతున్నా”.. మెట్రోలో మహిళ వీడియో వైరల్.. కేసు నమోదు
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
Cyclone Arnab: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
-
Bandi Sanjay: కరువు మండలాల జాబితాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!