S.JaiShankar: ప్రపంచం దృష్టి భారతదేశ ఆర్థికాభివృద్ధిపైనే.. మంత్రి కీలక వ్యాఖ్యలు
- ప్రపంచం భారతదేశ రాజకీయ సుస్థిరతపై ఓ కన్నేసి ఉంచుతోంది- ఎస్ జైశంకర్
- ప్రజాస్వామ్య దేశాల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం..
- మాములు విషయం కాదు- విదేశాంగ మంత్రి జైశంకర్
- భారత రాజకీయ సుస్థిరతను ప్రపంచం మొత్తం గమనిస్తోంది- జైశంకర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ అస్థిరత వాతావరణం నెలకొని ఉన్న తరుణంలో యావత్ ప్రపంచం భారతదేశ రాజకీయ సుస్థిరతపై ఓ కన్నేసి ఉంచుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం మాములు విషయం కాదని తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అక్కడ నిర్వహించిన మీడియా సంస్థ కార్యక్రమంలో మాట్లాడారు.
భారత రాజకీయ సుస్థిరతను ప్రపంచం మొత్తం గమనిస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ముఖ్యంగా చాలా దేశాలు రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న సమయంలో.. ప్రజాస్వామ్య దేశాల్లో వరుసగా మూడోసారి ఎన్నిక కావడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. 7-8 శాతం వృద్ధి రేటును సాధించడంలో ఇతర దేశాలు చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నందున.. మొత్తం ప్రపంచం దృష్టి భారతదేశ ఆర్థికాభివృద్ధిపైనే ఉందని జైశంకర్ తెలిపారు. చాలా పెద్ద కంపెనీలు భారతదేశంలో వ్యాపారం చేయడానికి ఉత్సాహంగా ఉన్నాయని.. దేశంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.
Also Read
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
ట్రంప్ విజయంపై..
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయంపై జైశంకర్ మాట్లాడుతూ.. అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పాలనలో అమెరికా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఆయన ఎన్నికతో యూఎస్ ఆర్థిక, తయారీ రంగాల్లో మరిన్ని ప్రయోజాలు పొందుతుందని తెలిపారు. ప్రపంచీకరణ అంశంపై ఓటర్లలో ఉన్న అసంతృప్తి అమెరికా ఎన్నికల్లో కనిపించిందన్నారు.
తాజావార్తలు
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!