Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Rythu Bharosa Third Installment Credit Today

YSR Rythu Bharosa: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఇవాళే ఖాతాల్లో సొమ్ము జమ

Published Date :February 28, 2024 , 9:00 am
By Sudhakar Ravula
YSR Rythu Bharosa: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఇవాళే ఖాతాల్లో సొమ్ము జమ
  • Follow Us :
  • google news
  • dailyhunt

YSR Rythu Bharosa: వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు రైతుల వంతు వచ్చింది.. రైతులకు పెట్టుబడిసాయంగా.. వైఎస్సార్‌ రైతు భరోసా కింద సాయం అందిస్తున్న విషయం విదితమే కాగా.. వరుసగా ఐదో ఏడాది మూడో విడత పెట్టు­బడి సాయం సొమ్మును ఈ రోజు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమయ్యారు సీఎం వైఎస్‌ జగన్‌.. దీంతోపాటు రబీ 2021–22, ఖరీఫ్‌–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును సైతం చెల్లించబోతున్నారు.. ఈ రెండు పథకాలకు అర్హులైన 64.37 లక్షల రైతు కుటుంబాల ఖాతాలకు రూ.1,294.34 కోట్ల సాయాన్ని ఈ రోజు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read Also: Bitcoin : 26నెలల తర్వాత 56000వేల డాలర్లకు చేరిన బిట్ కాయిన్

కాగా, నాలుగేళ్ల పాటు ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తూ వస్తుంది వైఎస్‌ జగన్‌ సర్కార్.. ఐదో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 చొప్పున రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసింది. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2 వేల చొప్పున 53.58 లక్షల మంది రైతన్నల బ్యాంకు ఖాతాల్లో ఈ రోజు రూ.1,078.36 కోట్లను జమ చేయనున్నారు.. మరోవైపు.. రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకుని సమ­యానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద పూర్తి వడ్డీ రాయితీని చెల్లిస్తూ వస్తుంది ప్రభుత్వం.. రబీ 2021–22, ఖరీఫ్‌–2022­లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు రూ.215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును కూడా ఈ రోజు విడుదల చేయనున్నారు సీఎం జగన్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • Farmers
  • rythu bharosa
  • ysr rythu bharosa

తాజావార్తలు

  • Bollywood Beauties : ఆ బాలీవుడ్ బ్యూటీస్ అందాల వేడికి మంచు కొండలు కరుగుతాయేమో

  • RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్‌.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్‌ ఎటాక్..!

  • Shehbaz Sharif: “పాక్ ‘కాపీ-పేస్ట్’ దౌత్యం”.. వైట్ హౌస్ స్క్రిప్ట్‌ను డ్రాఫ్ట్‌లో పెట్టి అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్ ప్రధాని..

  • NTRNeel : పుకార్లను కొట్టిపారేసిన మేకర్స్.. ‘డ్రాగన్’ షూటింగ్‌పై అఫీషియల్ ప్రకటన

  • Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్‌కు కీలక అదేశాలు..

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions