Serial Killer: ఆఫ్రికాలో హిడింబ.. వేశ్యల పాలిట యముడిగా మారిన నరరూప రాక్షసుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Serial Killer: ఆఫ్రికా దేశం రువాండాలో దారుణం జరిగింది. రువాండాలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ మారణకాండ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఏకంగా 14 మంది వేశ్యలను హత్య చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రువాండా రాజధాని కిగాలీలో ఓ నరరూప రాక్షసుడు వేశ్యలను లక్ష్యంగా చేసుకుని దారుణంగా హత్య చేశాడు. ఆ సీరియల్ కిల్లర్ ఓ అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. అతడి వయసు 34 సంవత్సరాలు. వేశ్యలను ఇంటికి పిలిపించుకుని వారిని హత్య చేసి, వారి నుంచి నగదు, ఫోన్లు, ఇతర వస్తువులు దోచుకునేవాడు. అనంతరం వారి మృతదేహాలను కిచెన్ లో ఓ గొయ్యి తీసి పాతిపెట్టేవాడు.
Also Read: AP News: NTV ఎఫెక్ట్.. ఎమ్మిగనూరులో శిశువు మృతిపై విచారణ
Also Read
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆ సీరియల్ కిల్లర్‌ను కిగాలీ పోలీసులు ఈ ఏడాది జులైలో దోపిడీ, అత్యాచారం, ఇతర ఆరోపణలపై అరెస్ట్ చేయగా.. పోలీసులు సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోవడం కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. పట్టువదలని పోలీసులు ఆ వ్యక్తి నివసిస్తున్న ఇంటిలో మరోసారి తనిఖీలు చేపట్టగా, కిచెన్‌లో పాతిపెట్టిన మృతదేహాలు బయటపడ్డాయి. ఆ కిచెన్‌లో 10 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఆ నరరూప రాక్షసుడిని అరెస్ట్ చేసి విచారించగా.. మరో నలుగురు వేశ్యల మృతదేహాలను యాసిడ్ పోసి కరిగించినట్లు తెలిపాడు. కుటుంబాలకు దూరంగా ఉండే వేశ్యలను, పెద్దగా స్నేహితులు లేని వేశ్యలను అతడు లక్ష్యంగా చేసుకునేవాడని పోలీసులు విచారణలో తెలిసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఆ సీరియల్ కిల్లర్ చేతిలో హతులైన వారిలో కొందరు మగ వేశ్యలు కూడా ఉన్నారట. ఇతడి వివరాలను తెలుసుకున్న పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.
తాజావార్తలు
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?