NTV Telugu Site icon

Shubman Gill Out: అనుకోని అదృష్టం.. భారత ప్రపంచకప్ జట్టులో ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్‌!

Ruturaj Gaikwad, Gill

Ruturaj Gaikwad, Gill

Ruturaj Gaikwad or Yashasvi Jaiswal to Join in India Squad for World Cup 2023:గత కొన్ని రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్న టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడంతో గిల్‌ ఆస్పత్రిలో చేరాడట. అయితే ప్రస్తుతం గిల్‌ పరిస్థితి బాగానే ఉందని, ఆస్పత్రి నుంచి త్వరలోనే డిశ్చార్జ్‌ అవుతాడని తాజాగా తెలుస్తోంది. కనీసం వారం రోజుల పాటు గిల్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. గిల్‌ ఇంకా కోలుకోలేదంటూ బీసీసీఐ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

డెంగీ జ్వరంతో బాధపడుతున్న శుభ్‌మన్ గిల్.. అక్టోబరు 14న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ఒకవేళ డెంగ్యూ నుంచి కోలుకున్నా.. మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తాడా? లేదా? అన్నది ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో ఓపెనర్‌ గిల్‌కు ప్రత్యామ్యాయ ప్లేయర్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ లేదా యశస్వి జైశ్వాల్‌లలో ఒకరిని ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్టర్లు భావిస్తున్నారట.

Also Read: Kancharla Bhupal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. గ్రామంలో అడుగుపెట్టకుండానే..!

సీనియర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కే శుభ్‌మన్ గిల్ కవర్‌ ప్లేయర్‌గా అవకాశం దక్కే ఛాన్స్‌ ఉంది. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఆసియా క్రీడలు 2023లో భారత జట్టుకు నాయకత్వం వహించిన రుతురాజ్‌.. ఏకంగా స్వర్ణ పతకం అందించాడు. ప్రపంచకప్‌ 2023 ఆరంభానికి ముందు రుతురాజ్‌ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఆడాడు. రోహిత్ శర్మ విశ్రాంతి నేపథ్యంలో తొలి రెండు వన్డేల్లో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రుతు.. శుభ్‌మన్ గిల్‌కు జోడీగా బరిలోకి దిగాడు. మొదటి వన్డేలో హాఫ్ సెంచరీ (71) బాదిన అతడు రెండో వన్డేలో 8 పరుగులు చేశాడు. అవసరం అయితే దూకుడుగా ఆడడం లేదా క్రీజులో సమయం వెచ్చించడం రుతుకు అలవాటే. ఇదే ఇప్పుడు అతడికి అనుకోని అదృష్టంగా మారనుంది. యశస్వి జైశ్వాల్‌ దూకుడుగా ఆడుతాడని తెలిసిన విషయమే. చూడాలి మరి ఏం జరుగుతుందో.