Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం, గత 24 గంటల్లో ఉక్రెయిన్‌లోని డోనెత్స్క్ ప్రాంతంలోని రెండు గ్రామాలను తమ సైన్యం స్వాధీనం చేసుకుంది. సిరెడ్‌నె, క్లెబన్ బైక్ గ్రామాలు ఇప్పుడు రష్యా నియంత్రణలోకి వెళ్లాయని ప్రకటించింది. అంతేకాకుండా రష్యా సైన్యం ఉక్రెయిన్ సైనిక సముదాయంపై దాడులు జరిపినట్టు తెలిపింది. 143 ప్రాంతాల్లో ఉక్రెయిన్ సాయుధ దళాలు, విదేశీ యోధుల తాత్కాలిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగానే గత వారం నాలుగు వైమానిక బాంబులు, 160 డ్రోన్లను కూల్చేసినట్టు రష్యా తెలిపింది.
CM Chandrababu: ఇక మాటల్లేవ్.. యాక్షన్ మాత్రమే.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ఇక మరోవైపు, అమెరికా మధ్యవర్తిత్వంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసాతో మాట్లాడారు. ఆయనతో జరిగిన చర్చల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. అలాగే జెలెన్‌స్కీ ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో.. దక్షిణాఫ్రికా అధ్యక్షుడి అభ్యర్థన మేరకు మాట్లాడాను. వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన సమావేశాల వివరాలు పంచుకున్నాను. రష్యా అధ్యక్షుడితో సమావేశానికి సిద్ధమని మరోసారి తెలియజేశానని పేర్కొన్నారు.
VP Elections: వీపి ఎన్నికకు విప్ లేదు.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓటు ఎటువైపు
అయితే మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. రెండు వారాల్లో ఉక్రెయిన్‌లో శాంతి దిశగా పురోగతి జరగకపోతే రష్యాపై కొత్త ఆంక్షలు విధిస్తాం అని ఆయన స్పష్టం చేశారు. అయితే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకారం.. పుతిన్-జెలెన్‌స్కీ భవిష్యత్ సమావేశానికి ఎలాంటి అజెండా లేదని తెలిపారు. జెలెన్‌స్కీ ప్రతీ అంశాన్నీ తిరస్కరిస్తున్నారని విమర్శించారు. దీంతో యుద్ధం ముగింపు, శాంతి చర్చల భవిష్యత్తుపై మళ్లీ అనిశ్చితి నెలకొంది.
