Site icon NTV Telugu

Russia New Year Gift : రష్యా న్యూ ఇయర్ గిఫ్ట్.. వారికి ఆదాయపన్ను లేనట్లే

Vladimir Putin

Vladimir Putin

Russia New Year Gift : సైనికులకు రష్యా ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించింది. ఉక్రెయిన్‌లో మోహరించిన సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉంటుందని రష్యా అధికారులు శుక్రవారం ప్రకటించారు. కాగా, ఉక్రెయిన్‌ యుద్ధంలో పాల్గొనేందుకు రష్యా తన సైనికులను మరింత సన్నద్ధం చేయడంలో భాగంగా ఇలాంటి గిఫ్ట్ ప్రకటించిందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Read Also: Rishi Sunak : నేను నటించాలనుకోవట్లేదు.. కొత్త ఏడాదిలో కష్టాలు తప్పవు

ఉక్రెయిన్‌లో సైనిక ఆపరేషన్‌కు మద్దతునిచ్చే తాజా ప్రయత్నంలో రష్యాది కొత్త ఎత్తుగడగా దీనిని అభివర్ణిస్తున్నారు. రష్యా తన స్వంత భూభాగాలుగా ప్రకటించిన నాలుగు ఉక్రేనియన్ భూభాగాల్లో పోరాడుతున్న వారందరికీ సంబంధించినది. ఉక్రెయిన్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖార్సన్. జపోరిజియాలోని నాలుగు ప్రాంతాల్లో యుద్ధంలో పోరాడుతున్న సైనికులను అవినీతి నిరోధక చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రకటన నేపథ్యంలో రష్యా సైనికులు ఇక నుంచి తమ ఆదాయం, ఖర్చులు, ఆస్తుల గురించి ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. ఈ ప్రకటన నేపథ్యంలో రష్యా సైనికులు ఇక నుంచి తమ ఆదాయం, ఖర్చులు, ఆస్తుల గురించి ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదన్నమాట.

Read Also: Alok Sharma : భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం.. బ్రిటన్ రాజు చేతుల మీదుగా నైట్ హుడ్ అవార్డు

సైనికులతో పాటు యుద్ధంలో సేవలందిస్తున్న పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారు. మాస్కో టైమ్స్ ప్రకారం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముసాయిదాపై సంతకం చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనే వారి శుక్ర కణాలను ప్రభుత్వం ఉచితంగా ఫ్రీజ్‌ చేయనున్నట్లు గతంలో ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. తద్వారా యుద్ధంలో వారికి ఏదైనా జరిగితే వారి వంశం కొనసాగేందుకు కూడా వీలుంటుంది.

Exit mobile version