NTV Telugu Site icon

Russia Fired Hypersonic Missile: ఉక్రెయిన్‌పై కొత్త హైపర్‌సోనిక్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా

Russia

Russia

Russia Fired Hypersonic Missile: రష్యాపై తన క్షిపణులను ఉపయోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికాతో సహా అనేక దేశాలు అనుమతి ఇవ్వడంతో.. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారీ చర్యలు తీసుకోవాలనే మూడ్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. వ్లాదిమిర్ పుతిన్ తాను అనుకున్న విధంగానే చేస్తున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్‌లోని ఒక నగరంపై హైపర్‌సోనిక్ మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. రష్యా గురువారం ఉక్రెయిన్‌లోని డ్నిప్రో నగరంపై హైపర్‌సోనిక్ మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఆధునిక పాశ్చాత్య ఆయుధాలతో రష్యా భూభాగంపై దాడి చేయడానికి కీవ్‌ను అమెరికా, బ్రిటన్ అనుమతించినందుకు ఇది ప్రతిస్పందనగా కనపడుతోంది. గత 33 నెలలుగా సాగుతున్న యుద్ధం మరింత ముదిరింది. ఓ నివేదిక ప్రకారం, ఉక్రేనియన్ నగరం డ్నిప్రోపై క్షిపణి హైపర్‌సోనిక్ మీడియం-రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించారు.

Also Read: AUS vs IND: టాస్ గెలిచిన బుమ్రా.. నితీశ్‌ రెడ్డి అరంగేట్రం! సీనియర్స్ అవుట్

అంతకుముందు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ఉక్రెయిన్‌పై దాడిలో తమ దేశం కొత్త ఇంటర్మీడియట్ రేంజ్ క్షిపణిని పరీక్షించిందని చెప్పారు. రష్యాపై క్షిపణులను ప్రయోగించడానికి ఉక్రెయిన్ అనుమతిని ఇచ్చిన దేశాలపై మాస్కో తన కొత్త క్షిపణులను ఉపయోగించవచ్చని ఆయన హెచ్చరించారు. అది ఇప్పుడు మొదలు పెట్టినట్లు కనపడుతుంది. ఈ వారం ప్రారంభంలో అమెరికన్, బ్రిటిష్ క్షిపణులతో రష్యా భూభాగంపై ఉక్రెయిన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా ఉక్రెయిన్‌పై గురువారం రష్యా దాడి జరిగిందని పుతిన్ టెలివిజన్ ప్రసంగంలో చెప్పారు. దాడులకు ముందు పౌరులను ఖాళీ చేయమని రష్యా ఇతర దేశాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుందని ఆయన ప్రకటించారు. రష్యా క్షిపణులను అమెరికా వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేవని హెచ్చరించారు.

Also Read: PM Modi: మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ