NTV Telugu Site icon

Russia President: అణ్వాయుధాలు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాం..

Puthin

Puthin

సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అణ్వాయుధాలను ప్రయోగించడానికి తాము వెనకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ తో కొనసాగుతున్న వార్ అణుయుద్ధాలకు దారి తీస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన ఈ మేరకు ఆన్సర్ ఇచ్చారు. బుధవారం ఆయన సెయింట్ పీటర్స్ బర్గ్‌లో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

Read Also: IND vs IRE: విజృంభించిన పేసర్లు.. ఐర్లాండ్‌పై భారత్‌ అలవోక విజయం!

కాగా, అణు యుద్ధం పేరిట రష్యా భయోత్పాతం సృష్టిస్తోందంటూ అమెరికా చేస్తున్న తప్పుడు ఆరోపణలను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా మండిపడ్డారు. వాస్తవానికి రెండో ప్రపంచ యుద్ధంలో అణ్వాయుధాన్ని వాడింది అమెరికాయేనని గుర్తు చేశారు. అయితే, ముప్పు పొంచి ఉన్నప్పుడు అణ్వాయుధ ప్రయోగానికి రష్యా చట్టాలు పర్మిషన్ ఇస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. అణ్వాయుధ ప్రయోగానికి సంబంధించి రష్యాకు ఓ విధానం అనేది ఉంది.. మా ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం ప్రమాదంలో ఉన్నప్పుడు మేము అణ్వాయుధాలు సహా అన్ని ప్రత్యామ్నాయాలను అనుసరిస్తామన్నారు. ఈ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దు అంటు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు.