Rupee vs US Dollar: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై అదనంగా 25 శాతం సుంకాలు విధించిన తర్వాత ఈ రోజు రూపాయి బలపడింది… అమెరికా – రష్యా చర్చల మధ్య సోమవారం ప్రారంభంలో భారత రూపాయి బలపడిందని అంచనా వేస్తున్నారు.. సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే స్థానిక కరెన్సీ 13 పైసలు బలపడి 87.53 వద్ద ప్రారంభమైంది.. శుక్రవారం డాలర్‌తో పోలిస్తే ఇది 87.66 వద్ద ముగిసింది. ట్రేడింగ్ పరిధి 87.25 మరియు 87.80 మధ్య ఉందని ఫిన్‌రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఎల్‌ఎల్‌పీ ట్రెజరీ అధిపతి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ భన్సాలీ అన్నారు.
Read Also: MS Dhoni: నా మోకాలి నొప్పి ఎవరు భరిస్తారు?.. అభిమానితో ఎంఎస్ ధోనీ!
భారత రూపాయి ఈరోజు స్వల్ప లాభాలతో 87.51 వద్ద ప్రారంభమవుతుందని అంచనా వేయబడింది.. అయితే మార్కెట్లు అమెరికా మరియు భారతదేశం ద్రవ్యోల్బణం.. ఆగస్టు 15న జరిగే అమెరికా-రష్యా చర్చల కోసం వేచి చూసే రీతిలో ఉన్నాయి.. ఈ చర్చలు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగితే భారతదేశం యొక్క అదనపు 25 బేసిస్ పాయింట్ల సుంకాల సమస్యను పరిష్కరించగలవని భన్సాలీ పేర్కొన్నారు.. ఆర్‌బీఐ డాలర్లను అమ్మడం ద్వారా రూపాయి బలహీనతను కాపాడుతుంది.. కాబట్టి, ఎగుమతిదారులు తమ స్వల్పకాలిక రాబడులను విక్రయించవచ్చు అని సూచించారు.. ఇక, సోమవారం ఉదయం ఆసియా వాణిజ్య మార్కెట్‌లో బ్రెంట్ చమురు ధరలు బ్యారెల్‌కు 66.25 డాలర్లకు పడిపోయాయి, గత వారం నుండి బాగా తగ్గుదల కొనసాగింది, వ్యాపారులు.. రష్యా మరియు యుఎస్ మధ్య ఉక్రెయిన్ వివాదంలో శాంతిని తెలియజేస్తూ రాబోయే చర్చల కోసం ఎదురు చూస్తున్నారు.
