NTV Telugu Site icon

Harish Rao : మారథాన్ రన్‌లో అందరూ పాల్గొనాలి

Harish Rao

Harish Rao

ప్రకృతి, తెలంగాణ సంస్కృతి అద్భుతమైన మేళవింపుతో క్లీన్ అండ్ గ్రీన్ చారిత్రాత్మక నగరమైన సిద్దిపేటలో జరిగే 5కే, 10కే, హాఫ్ మారథాన్ రన్‌లో పాల్గొనేందుకు రన్నర్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికులు అందరూ రావాలని తెలంగాణ ఆరోగ్య, ఆర్థిక మంత్రి టీ హరీష్‌ రావు సోమవారం పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే.. ఇటీవల సిద్దిపేట పట్టణంలో ఆగస్టు 6న ఆఫ్ మారథాన్ నిర్వహించనున్నట్ల సిద్దిపేట పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 5కే, 10కే, 21కే రన్కు సంబంధించిన పోస్టర్ను కొమటిచెరువు వద్ద అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, పోలీసు అధికారులతో కలిసి సీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హాఫ్ మారథాన్ ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం 300మందితో ప్రమోషన్ రన్ నిర్వహించారు.

Also Read : Health Tips : వీటిని రోజు తింటే యవ్వనంగా, మరింత అందంగా కనిపిస్తారు..!

ఈ రన్ లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. మంత్రి హరీశ్ రావు చొరవతో ఆరోగ్య సిద్దిపేటలో భాగంగా పట్టణంలో హాఫ్ మారథాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈవెంట్స్ లో సిద్దిపేట జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణ గురించి మంత్రి హరీశ్ రావు ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారన్నారు. ఈ హాఫ్ మారథాన్లో పాల్గొనేవారు ప్రతీరోజు యోగా, వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, జిమ్, ఏదో ఒక వ్యాయామం చేస్తూ ఉండాలని సూచించారు. 5కే, 10కే, 21కే రన్లో పాల్గొనాలనుకునే వారు ఈ నెల 20వ తేది సాయంత్రం 6గంటల వరకు ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ఈవెంట్స్ సిద్దిపేట రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నుంచి, సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.

Also Read : Pakistan Women: ఐ స్టిల్ లవ్ యూ సీమా.. పాకిస్థాన్ కు నా భార్యను పంపించండి..